Ponnavolu : చంద్ర‌బాబు బెయిల్‌పై పొన్న‌వోలు సంచ‌ల‌న కామెంట్స్

Ponnavolu : స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్ర‌బాబుకి ఇటీవ‌ల న్యాయ‌స్థానం బెయిల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబుకి బెయిల్ రావ‌డంతో తెలుగు తమ్ముళ్లు సంబురాలు చేసుకున్నారు. కాని సీఐడీ తరపున ఏసీబీ కోర్టులో బలమైన వాదనలు వినిపించిన అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాత్రం ఆ తీర్పు న్యాయ స‌మ్మ‌త‌మైన‌ది కాద‌ని అన్నారు. హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతం, చట్ట సమ్మతం కాదని.. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడం దురదృష్టకరం అని ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.సీఐడీ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాము అని వివరించారు. ఆధారాలు ఉన్నాయని చెప్పినా హైకోర్టు పట్టించుకోకుండా తీర్పు ఇవ్వడం అప్రజాస్వామికం అని ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీ స్కిల్ కేసును ఈడీ, సీఐడీ దర్యాప్తు జరుపుతోందని, చార్జిషీట్ వేసినప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. సాక్ష్యాలు ఆధారాలు ట్రయల్ కోర్టు దగ్గర ఉంటాయని వెల్లడించారు. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించింది అని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అధికార దుర్వినియోగం చేయడానికి తన మనుషులకు దోచి పెట్టడానికి ముఖ్యమంత్రిగా అధికారం లేదు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్ము దోచేశారు. సీమెన్స్ నివేదిక, కొనర్ రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

Ponnavolu sensational comments on chandra babu bail
Ponnavolu

ఇది ఆర్ధిక నేరం. ఐపీసీ నేరం కాదు. ఈ కేసులో కక్ష సాధింపు చర్య లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 17 ఏ కేసు తీర్పు రిజర్వ్ చేయబడింది. 17 ఏ కేసు క్వాష్ పిటిషన్ లో బెయిల్ అంశం ఉందని మేము హైకోర్టుకి చెప్పినా ఆ అంశాన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు తీర్పులో కనీసం మెన్షన్ చెయ్యలేదు. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలనుకుంటే జైల్లో 73ఏళ్లు దాటిన వారందరి కోసం సీఆర్పీసీ చట్టం సవరిస్తే గొడవే ఉండదు. స్కిల్ కేసులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వచ్చాం.జడ్జిని ప్రశించే హక్కు మాకు లేదు. కానీ జడ్జిమెంట్ ని ప్రశ్నించే హక్కు మాకుంది. 17ఏ గురించి ప్రతి ఒక్కరూ చర్చలు చేసి సొంత జడ్జిమెంట్లు ఇస్తున్నారు. చంద్రబాబు బెయిల్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో డైరీ నెంబర్ వచ్చింది. త్వరగా విచారణకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం” అని ఏపీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. అయితే పొన్న‌వోలు కామెంట్స్ పై టీడీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయన తీరు న్యాయవృత్తికే కళంకమని తాజా మీడియా సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు రామ‌య్య‌.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago