Sanju Samson : వరల్డ్ కప్ ఓటమి నుంచి తేరుకోకముందే ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. నవంబర్ 23 నుంచి ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ కోసం.. భారత సెలక్షన్ కమిటీ సైతం ఇప్పటికే జట్టును ప్రకటించింది. సొంత గడ్డపై జరిగే ఈ సిరీస్ కోసం.. సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ బృందంలోని ముగ్గురికే ఈ టీంలో చోటు దక్కింది. అయితే సంజూ శాంసన్‌ని ఎంపిక చేయకపోవడంపై ఇప్పుడు తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంజూపై ఎందుకింత కక్ష అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్‌కు ఎంపిక చేయలేదు.. ఏషియన్ గేమ్స్‌కు ఎంపిక చేయలేదు.. కనీసం ఆస్ట్రేలియాతో సిరీస్‌కైనా తీసుకోవాల్సి కదా.. ఎందుకు జట్టులోకి తీసుకెలేదు అని బీసీసీఐ పెద్దలని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్ తన ట్వీట్‌లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు సంజూ శాంసన్ ను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ క్రికెట్ ఫ్యాన్స్ కు వివరించాలని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. సీనియర్ ప్లేయర్స్ లేనప్పుడు సంజూను కెప్టెన్ గా చేయాల్సింది. కేరళ స్టేట్ జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా చేసిన అనుభవం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కంటే ఎక్కువ కెప్టెన్సీ అనుభవం ఉంది. అలాంటి ఆటగాణ్ని జట్టులోకి ఎందుకు తీసుకోలేదు. స్పిన్నర్ చాహల్ ను కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదు. ” అని ట్వీట్ చేశారు శశి థరూర్.
ఐపీఎల్‌లో అదరగొడుతూ.. భారత జట్టు తరఫున కూడా రాణిస్తున్నా.. సంజూ శాంసన్‌కు మాత్రం రెగ్యులర్ స్థానం దక్కలేదు. ప్రతీసారి అవకాశం ఇవ్వకపోవడం పట్ల అతడి ఫ్యాన్స్ బీసీసీఐ పెద్దలపై గుర్రుగా ఉన్నారు. వాస్తవానికి వన్డే ప్రపంచకప్ 2023లో తుది జట్టులో సూర్య కుమార్ యాదవ్ స్థానంలో సంజూ శాంసన్ ఉండుంటే.. కథ వేరేగా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు తరహాలో సంజూకు కూడా సెలక్టర్లు అన్యాయం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వద్దు సంజూ ఇక వెయిట్ చేయడం చాలు.. రిటైరైపో అని సలహాలు ఇస్తున్నారు. భారత జట్టుకు రిటర్మైంట్ ప్రకటించి.. నెదర్లాండ్స్, ఐర్లాండ్ వంటి దేశాల జట్ల తరఫున ఆడాలని సూచిస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…