Ponnambalam : 90ల కాలంలో సినిమాలు వీక్షించిన వారికి పొన్నాంబలం పేరు చాలా సుపరిచితం. రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలకు ప్రతినాయకుడిగా నటించారు. తెలుగులోనూ ఈయన పాపులారిటీకి డోకా ఏమీ లేదు. కనిపించేది కొన్ని నిమిషాలే అయినా తనదైన నటన, శైలితో ఎంతో ఆకట్టుకున్నారు. చూడగానే ప్రతి ఒక్కరు భయపడేలా ఇతని నటన ఉంటుంది. అయితే, కోలీవుడ్‌లో తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో పొన్నంబలం అనుకోకుండా సినిమాల నుంచి తప్పుకున్నారు. కొద్ది గ్యాప్ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. 2018లో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2లో పొన్నంబలం పాల్గొని సందడి చేశారు.
అయితే గత రెండేళ్లుగా పొన్నాంబలం ఆరోగ్యం అంతగా ఏమి బాగోలేదు. తన రెండు కిడ్నీలు పాడవ్వడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆ మధ్య తనకు సాయం చేయాలని కోరగా, కొందరు సాయం చేసిన కూడా కోలుకోలేదు. ఆ తర్వాత చిరంజీవి సాయం తీసుకున్నారు. స్నేహితుడి ద్వారా చిరు నెంబర్ తీసుకొని ‘అన్నయ్య నాకు బాగోలేదు.. మీకు చేతనైనంత సాయం చేయండి’ అని మెసేజ్ పెట్టారట. మెసేజ్ చేసిన పది నిమిషాల తర్వాత పొన్నంబలానికి చిరంజీవి ఫోన్ చేశారట. ‘హాయ్ పొన్నంబలం.. ఎలా ఉన్నావు.. ఆరోగ్యం బాగాలేదా.. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా.. నేను ఉన్నాను, కంగారుపడకు.. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావా అని చిరంజీవి నన్ను అడిగారు.
నేను రాలేను అన్నయ్య అని చెప్పాను. అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లండి.. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు. అక్కడికి వెళ్తే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. అక్కడే నాకు వైద్యం అందించారు. నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు. రూ.45 లక్షలు ఖర్చయ్యింది. మొత్తం ఆయనే చూసుకున్నారు. చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు. రామ్ చరణ్ సార్ భార్యదే అపోలో హాస్పిటల్. ఆమె ద్వారానే నాకు వైద్యం అందింది’’ అని పొన్నంబలం ఓ తమిళ ఛానెల్ లో చాలా భావోద్వేగంతో చెప్పుకొచ్చారు. అయితే తన తమ్ముడి వల్లనే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని అన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…