Iratta Movie Review : ఓటీటీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీ.. ఇరట్టా.. తెలుగు వెర్షన్‌.. రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Iratta Movie Review : ఇటీవ‌ల ఓటీటీలో వ‌స్తున్న చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఇర‌ట్టా అనే చిత్రం మ‌ల‌యాళంలో విడుద‌లై మంచి విజ‌యం సాధించి ఇప్పుడు తెలుగులో డ‌బ్ జ‌రుపుకొని ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ సినిమా క‌థ ఏంట‌నేది చూస్తే.. కేరళలోని వాగమన్ అనే ఊరిలోని పోలీస్ స్టేషన్ లో చిన్న ఈవెంట్ జరుగుతూ ఉండ‌గా, అక్క‌డికి అటవీశాఖా మంత్రి వస్తున్నారని తెలిసి హంగామా న‌డుస్తుంటుంది. మరికాసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది అనేసరికి.. స్టేషన్ లో గన్ కాల్పులు వినిపిస్తాయి. లోపలికి వెళ్లి చూస్తే ASI వినోద్(జోజూ జార్జ్) చనిపోయి ఉంటాడు. ఆ స‌మ‌యంలో లోప‌ల ముగ్గురు పొలీసులు ఉంటారు.

వినోద్‌ని చంపింది ఆ పోలీసులేనా, లేకుంటే వేరే కార‌ణాల వ‌ల‌న అత‌ను చ‌నిపోయాడా అనేది ఇర‌ట్టా చిత్రం చూస్తే తెలుస్తుంది. ఇరట్టా అంటే మలయాళంలో ఇద్దరు, డబుల్ అని అర్థం. ఇప్పటివరకు మీరు ఎన్నో థ్రిల్లర్స్ చూసి ఉండొచ్చు కానీ ‘ఇరట్టా’ మాత్రం ప్ర‌త్యేకం అని చెప్పాలి. ఒక్కో లేయర్ విడిపోతున్నకొద్ది ప్రతి ఒక్కరిపైనా సందేహం వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ తో అతడి చావుకు గల కారణాన్ని రివీల్ చేసుకుంటూ వెళ్లడం ఆకట్టుకుంటుంది. చివరకు వినోద్ ని అతడి సోదరుడు ప్రమోద్ చంపినట్లుగా అనుమానపడటం లాంటివి సినిమాని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చేశాయి. చిత్రానికి క్లైమాక్స్ మాత్రం వేరే లెవల్ ఉంటుంది.

Iratta Movie Review in telugu know how is the movie
Iratta Movie Review

ఇక ఎప్పుడైతే తమ్ముడి మరణాన్ని ఇన్వెస్టిగేట్ చేసేందుకు డీఎస్పీ ప్రమోద్ రంగంలోకి దిగుతాడో.. స్టోరీ జెట్ స్పీడులో దూసుకెళ్తుంది. ఓ పోలీస్, అది కూడా స్టేషన్ లోనే ప్రజల సమక్షంలోనే చనిపోవడం అనే పాయింట్ ని చాలా ఉత్కంఠభరితంగా తీయడాన్ని కచ్చితంగా మెచ్చుకుని తీరాలి. న‌ట‌న విష‌యానికి వ‌స్తే జోజూ జార్జ్ రెండు డిఫరెంట్ పాత్రలని మడిచి అద‌ర‌గొట్టేశాడు. అంత అద్భుతంగా నటించాడు. డీఎస్పీ ప్రమోద్ పాత్రలో కూల్ గా, వినోద్ పాత్రలో రఫ్ గా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి స్టోరీని వేరే లెవ‌ల్‌కి తీసుకెళ్లాడు. అక్కడక్కడ బోరింగ్ సీన్స్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ త‌ప్ప సినిమా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago