Pokiri : మ‌హేష్ బాబు పోకిరి సినిమాకు ఆ టైటిల్ పెట్ట‌డం వెనుక ఉన్న క‌థ ఏమిటో తెలుసా..?

Pokiri : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరికి 17 ఏళ్లు పూర్తయింది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఈ ఒక్క డైలాగు చాలు పోకిరి స్టామినా ఏంటో చెప్పడానికి. సినిమా వచ్చి 17 ఏళ్లయినా ఇప్పటికీ ఎక్కడో ఓ చోట దీని గురించి, ఇందులోని సంభాషణల గురించి మాట్లాడుతూ ఉంటారు. మహేష్ బాబును టాలీవుడ్ టాప్ హీరోగా మార్చిన సినిమా పోకిరి. శివ తర్వాత మరో అంతటి ఇండస్ట్రీ హిట్ సాధించిన మూవీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీవినీ ఎరుగని రీతిలో కలెక్షన్లు వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. ఈ చిత్రం ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సాధించింది.

ఈ సినిమా కథను పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా చేస్తున్న సమయంలో పూరీ జగన్నాథ్ రాసుకున్నాడు. పవన్ కు చెప్పాడు కూడా. అయితే ఈ స్టోరీ తనకు నచ్చలేదని చెప్పాడట. ఆ తర్వాత రవితేజతో చేయాలి అనుకున్నాడట. డేట్స్ కుదరకపోవడంతో వెనక్కి తగ్గాడు. ఓ రోజు మహేష్ బాబుకు ఈ స్టోరీ వినిపించాడు. తనకు నచ్చడంతో ఓకే చెప్పాడు. కానీ పూరీ ఈ సినిమాకు పెట్టిన ఉత్తమ్ సింగ్, సన్నాఫ్ సూర్యనారాయణ అనే టైటిల్ ల‌ను మార్చమని మహేష్ సలహా ఇచ్చాడట. పండు, పోకిరి అనే పేర్లను సజెస్ట్ చేశాడు. పూరీ.. పోకిరి అనే టైటిల్ ఓకే చేశాడు.

Pokiri movie title the reason behind it
Pokiri

ఈ సినిమాను 9 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు. రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ అయింది. 2006 ఏప్రిల్ లో ఎలాంటి అంచనాలు లేకుండా మూవీ రిలీజ్ అయింది. నెమ్మదిగా ప్రారంభమైనా హిట్ టాక్ తో కొద్ది రోజుల్లోనే దుమ్ము లేపింది. జనాలు ఈ సినిమా చూసేందుకు థియేటర్లకు ఎగబడ్డారు. ఈ సినిమాలోని పాటలు, ఫైట్స్, డైలాగ్స్ అన్ని జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అద్భుతమైన క్లైమాక్స్, మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ అద్భుతమైన డైలాగ్స్ రాశాడు. అంతకుముందు ఏ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ చూసి ఉండరు. అందుకనే ఈ మూవీ ఆల్ టైమ్ హిట్ రికార్డుల‌ను సాధించింది.

Share
editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago