Perni Nani : వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు అగ్నికి ఆహుతైన నేపథ్యంలో మత్సకారులని పవన్ కళ్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. వైజాగ్ వెళ్లడానికి బయలుదేరితే తన విమానం అదృశ్యం చేశారంటూ విమర్శించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ నిద్రలేచే సరికే సీఎం జగన్ బోట్లు కోల్పోయిన మత్సకారులకు సాయం అందించారని గుర్తుచేశారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ నటన మెగాస్టార్ చిరంజీవి సైతం ఆశ్చర్యపోయేలా వుందన్నారు. చంద్రబాబుకి రాజకీయ లబ్ధి చేకూర్చడమే పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు. జనసేన ఆవిర్భావం నుండి నేటి వరకు చంద్రబాబు కోసమే పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని పేర్ని నాని తెలిపారు.
పవన్ మత్సకారులకు పంచిన డబ్బు కంటే ఆయన వచ్చి వెళ్లిన విమానం ఖర్చే ఎక్కువ అని పేర్నినాని విమర్శించారు. పవన్ తన దగ్గర డబ్బుల్లేవని చెబుతారని, కానీ డబ్బుల్లేకుంటే ప్రత్యేక విమానంలో వైజాగ్ కు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. నిన్న ఫిషింగ్ హార్బర్ లో పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు సీఎం జగన్ పై విషం చిమ్మడం అలవాటుగా మారిందన్నారు. మత్సకారులకు సీఎం జగన్ ఏమీ చేయలేదని చెప్పడంపై స్పందిస్తూ 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
పవన్ తన దగ్గర డబ్బులు లేవని చెబుతున్నాడరని.. మరి డబ్బులు లేకుంటే ఛార్జెట్ ఫ్లైట్‌లో ఎలా వస్తారని పేర్ని నాని దుయ్యబట్టారు. సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్మడం పవన్‌కు అలవాటుగా మారిందని, జగన్ వచ్చాకే 10 ఫిషింగ్ హార్బర్లు మంజూరయ్యాయని ఆయన పేర్కొన్నారు. పవన్ నిద్రలేచే సరికే ప్రమాదంలో నష్టపోయిన మత్స్యకారులకు జగన్ అండగా నిలిచారని పేర్నినాని తెలిపారు. కాపులను పవన్ ఏనాడైనా మనుషుల్లా చూశాడా.. వారిని పెట్టుబడిగా, ఆస్తిగా, టోకుగా చంద్రబాబుకు బేరం పెట్టడానికే పవన్ చూస్తున్నారని ఆయన ఆరోపించారు. విమానం రానివ్వపోవడానికి వైసీపీకేం పని అని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమేనని.. బాబును అధికారంలో చూడాలనే ఆకాంక్షతోనే జనసేనాని పనిచస్తున్నారని ఆయన ఆరోపించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…