CM KCR : తెలంగాణ ఎన్నికలు నేపథ్యంలో జోరుగా అనేక ప్రచారాలు సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా దూషించుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలోను అనేక ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో కొన్నింటికి కేసీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణను పరిపాలిస్తున్నారంటే అందుకు కారణం సోనియాగాంధీయేనని, ఆమె దయవల్ల, రాజ్యాంగం దయవల్ల, పార్లమెంటరీ సిస్టం వల్ల రాష్ట్రం వచ్చిందని గుర్తుంచుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ రోజు అక్రమాలు చేసి సంపాదిస్తున్న డబ్బు అంతా కేసీఆర్ ఇంటికి చేరుకుందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతల వద్ద కూడా ఈ అక్రమార్జన ఉందన్నారు.
తెలంగాణ ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. ఇక్కడి యువత కలలను, ఆశయాలను బీఆర్ఎస్ నాశనం చేసిందన్నారు. కుటుంబ పాలన, అవినీతి పాలన వల్ల తెలంగాణ ఎంతో నష్టపోయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన కనిపించడంలేదని ఆరోపించారు. తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా పెరిగిందని, ఆ డబ్బంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికే చేరిందని కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కేసీఆర్ .. సోనియా గాంధీని దేవత అన్నాడని, ఆమె కాళ్లు మొక్కాడని ప్రచారం జరుగుతుంది. అయితే తాను ఏనాడు సోనియాని దేవత అనలేదని, వేరే కాంటెస్ట్‌లో అన్నదానిని అలా ప్రచారం చేశారంటూ కేసీఆర్ చెప్పుకొచ్చాడు.
విలేకరులు మాట్లాడుతూ ఆమె మీకు తెలంగాణ ఇస్తుందని అంటుంద అని అన్నారు. అయితే ఎవరు తెలంగాణ ఇస్తే వారు మాకు దేవుళ్లు అన్నట్టు చెప్పాను. ఈ కాంటెస్ట్‌లో చెబితే నేను దేవత అన్నట్టు ప్రచురించారు అని కేసీఆర్ అన్నారు. ఎవ్వరైన తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పితే రోడ్డుకి ఈడ్చుతాం అని అంటే, దానిని వేరేలా ప్రచురించారు అని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇక తెలంగాణ ఇచ్చినందుకు కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరించినట్టు ఓక ఫోటో వైరల్ అయింది. అయితే కేసీఆర్ వంగి మరొకరి పాదాలకు నమస్కరిస్తున్న అసలైన ఫోటో అది. 2015 జూన్ నెలలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు, కేసీఆర్ ప్రణబ్ ముఖర్జీ పాదాలను తాకి స్వాగతం పలికిన దృశ్యాన్ని ఎడిట్ చేసి సోనియా కాలు మొక్కినట్టు వైరల్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…