మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారు. ఇక చిరంజీవి స్పూర్తితో పవన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా మారాడు. అయితే చిరంజీవి ఇప్పటికీ పవన్ కళ్యాణ్‌ని తన సొంత బిడ్డలా చూసుకుంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నాకు బిడ్డలాంటి వాడు. మా కుటుంబానికి తనకు అమితమైన ప్రేమ. నా చేతులతో తనను పెంచాను. నిస్వార్థపరుడు.. డబ్బు, పదవుల మీద ఎలాంటి వ్యామోహం ఉండదు. నిజం చెప్పాలంటే మొన్నటిదాకా పవన్ కు సొంత ఇల్లు కూడా లేదు. రాజకీయాలను ప్రక్షాళన చేసి ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ రంగంవైపు వచ్చాడు అని పేర్కొన్నాడు.
పవన్ కళ్యాణ్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, స్టోరీ రైటర్‌గా, దర్శకుడిగా, ఫైట్ కంపోజర్‌గా కూడా సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవికి తమ్ముడు పవన్ ఫైట్లు కంపోజ్ చేయడం విశేషం. పవన్ తన సినిమాల్లో ఫైట్లు కంపోజ్ చేస్తూ ఉంటాడు. ఇదే క్రమంలో అన్నయ్య కోసం యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా మారడం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. చిరంజీవి నటించిన డాడీ సినిమాలో డీసెంట్ ఫైట్స్ సీన్లు ఉంటాయి. వాటిని పవన్ కంపోజ్ చేయడం విశేషం.
ఇందకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది. ఫోటో కూడా వైరల్ అవుతుంది. `డాడీ` సినిమాలో చిరంజీవికి ఫైట్లు కంపోజ్ చేస్తూ కనిపించారు పవన్. ఇందులో ఆయన గుండుతో కనిపించడం మరో విశేషం. ఈ పిక్ చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. ఇప్పటికే పవన్ – చిరు వెండితెరపై కలిసి కనిపించి సందడి చేసిన విషయం విదతమే. ఇక ప్రస్తుతం చిరంజీవి `వాల్తేర్ వీరయ్య` చిత్రంలో నటించారు. ఇది సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదల కాబోతుంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. మరోవైపు పవన్ ప్రస్తుతం `హరి హరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌కి విడుదల చేయనున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…