మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. మెట్టు మెట్టు ఎక్కుతూ.. మెగా సామ్రాజ్యాన్నే స్ఠాపించాడు. ఇప్పుడు టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారిన చిరంజీవి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. ఇక చిరంజీవి వారసులుగా.. తమ్ముళ్ళు.. కొడుకులు.. అల్లుళ్లు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక మెగా వారసుడిగా రామ్ చరణ్ మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. చిరుతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు.
ఇక రామ్ చరణ్ కు సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అదేంటంటే.. చరణ్ అసలు యాక్టర్ అవ్వాల్సింది కాదట. ఆయన డాక్టర్ అవ్వల్సింది పోయి.. యాక్టర్ అయ్యాడట. రామ్ చరణ్‌ని డాక్టర్ చేయాలని మెగాస్టార్ కొరిక అని తెలుస్తోంది. చిరంజీవిని సినీ పరిశ్రమకు పరిచయం చేయడం మెగాస్టార్‌కి అస్సలు ఇష్టం లేదట. ఇండస్ట్రీలో సక్సెస్ వస్తుంది రాదు చెప్పలేం.. అందుకే శోభన్ బాబు లాంటిస్టార్స్ తమ వారసులను ఇటు వైపు చూడకుండా జాగ్రత్త పడ్డారు. మెగాస్టార్ కూడా అలానే ఆలోచించాడట. ఎప్పుడు పరిస్థితులు ఒకేలా ఉండవనే విషయం చిరంజీవికి బాగా తెలుసు కాబట్టి చరణ్ ను కూడా మూవీ వైపు రాకుండా ప్రయత్నం చేశాడట.
సినీ పరిశ్రమలో మనని తొక్కేసే వాళ్లు కూడా ఉంటారు. అందుకే ఇలాంటి టెన్షన్స్ తన కొడుకు పడవద్దు అనుకున్నారట. అంతే కాదు.. చరణ్ డాక్టర్ అవ్వాలని మెగాస్టార్ కు కోరిక ఉండేదట… డాక్టర్ గా ఆయన ఎన్నో ప్రాణాలు కాపాడుతుంటే చూసి సంతోషించాలి అనుకున్నారట. కానీ చరణ్ కి మొదటి నుంచి చదువు మీద పెద్దగా శ్రద్ద లేదని.. ఆయన యావరేజ్ స్టూడెంట్ గానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా సైన్స్ అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదట . అందుకే చిరు కూడా రామ్ చరణ్ ను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా.. తన కోరికను క్రమేపి చంపేసుకున్నాడట. ఇక చరణ్.. సినిమాల్లోకి వస్తానని చిరంజీవికి చెప్పడంతో ఆయన ఓకే అనడం ఇప్పుడు పెద్దగా హీరోగా మారడం మనం చూసాం. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చరణ్ రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…