Pawan Kalyan : ఇటీవలి కాలంలో మెగా ఫ్యామిలీలో విడాకుల పర్వం ఎక్కువైంది. కొద్ది రోజులుగా శ్రీజ, నిహారికల విడాకులకి సంబంధించి ఎన్నో వార్తలు వస్తుండగా, శ్రీజ విడాకులపై ఇంత వరకు క్లారిటీ రాలేదు కాని నిహారిక మాత్రం జూలై 5న తాను విడాకులు తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ విడాకులకి సంబంధించి కూడా జోరుగా ప్రచారాలు సాగాయి. పవన్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడాకులు తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. కొంత కాలంగా వీరిద్దరూ విడిగానే ఉంటున్నారని.. అన్నా లెజినోవా పిల్లలను తీసుకుని రష్యా వెళ్లిపోయిందని వార్తలు వస్తున్నాయి.
మెగా ఇంట ఎలాంటి వేడుకలోనైనా చురకుగా కనిపించే అన్నా.. ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ లేకపోయినా కానీ.. మెగా ఇంట్లో జరిగే ప్రతీ ఫంక్షన్‌లోనూ అన్నా కనిపించేది. కానీ వరుణ్-లావణ్య నిశ్చితార్థంలో పవన్ ఒక్కడే కనిపించాడు తప్ప అన్నా లెజ్నోవా కనిపించలేదు. అలానే రామ్‌చరణ్-ఉపాసనల కుమార్తె బారసాల ఫంక్షన్‌లోనూ కనిపించలేదు. వారాహీ విజయయాత్రకు ముందు పవన్ కళ్యాణ్ నిర్వహించిన యాగంలో కూడా అన్నా లెజినోవా కనిపించలేదు. ఈ పరిస్థితులన్నిటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కల్యాణ్ అన్నా విడిపోయారంటూ పుకార్లు పుట్టించారు.
పవన్ ని ఇబ్బంది పెట్టడం కోసం దుష్ప్రచారంగా వైసీపీ వాళ్లు చేస్తున్ పని ఇది అని పవన్ అభిమానులు భావించారు ఈ క్రమంలోనే ఒకే ఒక్క ఫొటో రిలీజ్ చేసి పుకార్లకి చెక్ పెట్టారు. పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొని.. హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. ఈ ఫోటోను అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది జనసేన టీమ్. దీంతో వైసీపీ శ్రేణులు పుట్టించిన పుకార్లకి పులిస్టాప్ పడింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…