Niharika : గత రెండు రోజులుగా నిహారిక చైతన్యల విడాకుల విషయం టాలీవుడ్ లో ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఎందుకు విడిపోయారు అని ప్రతి ఒక్కరు గట్టిగా క్లాస్ పీకుతున్నారు. దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిహారిక అంత ఘనంగా పెళ్లి చేయగా, కొద్ది రోజులకే తుస్సుమనిపించారు. కొద్ది రోజులుగా వీరి విడాకులకి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతుండగా, జూలై 5న నిహారిక- చైతన్యలు తమ విడాకుల విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు.
చైతన్య.. నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విషయంలో మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేము ఈ కొత్త లైఫ్‌ని లీడ్ చేసేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని పేర్కొంది. అయితే విడాకులు తీసుకున్నా కూడా నిహారికలో బాధ అనేది ఏ మాత్రం కనిపించడం లేదు. సరదాగా తిరుగుతుంది, ఎంజాయ్ చేస్తుంది. తన సినిమాలు, ప్రాజెక్టుల విషయంలో బిజీబిజీగా ఉంటూ గత జ్ఞాపకాలన్నింటిని మరచిపోతుంది. 2020 డిసెంబర్‌లో నిహారిక-చైతన్య వివాహం జరిగింది. రాజస్థాన్ ఉదయపూర్‌లోని ఇరు కుటుంబాల సమక్షంలో వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. చాలా గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది. ఇక కెరీర్ విషయానికొస్తే ఈ మధ్యే ‘డెడ్ పిక్సల్స్’ అంటూ ఓ వెబ్ సిరీస్ చేసింది నిహారిక. అలానే ప్రస్తుతం తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో ఒక సిరీస్‌ను నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
రీసెంట్‌గా నిహారిక, శ్రీజ, సుస్మిత ఒకే చోట కనిపించారు. ఓ స్టోర్ ప్రారంభోత్సవం కోసం మెగా ఆడపడుచులు ఇలా ఒక్క చోట కనిపించే సరికి మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. నిహారిక, శ్రీజలు తమ భర్తలని వదిలేసామన్న బాధ ఏ మాత్రం కనిపించడం లేదు. శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా, ఆ రెండు పెళ్ళిళ్లు కూడా పెటాకులు అయ్యాయి. కళ్యాణ్ దేవ్, శ్రీజ గత కొద్ది రోజులుగా విడివిడిగానే ఉంటున్నారని తెలుస్తుంది. వీరిద్దరు విడాకుల అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…