Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉభయగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. నిన్న కాకినాడలో వారాహి విజయ యాత్ర సభ నిర్వహించగా, ఈ సభకు జనం పోటెత్తారు. కాకినాడ పురవీధులు జనంతో నిండిపోవడంతో పవన్ కళ్యాణ్‌ను సమీపం నుంచి చూసేందుకు జనసైనికులు చెట్లు, బిల్డింగ్‌లు ఎక్కారు. దారి పొడుగునా పూల వర్షం కురిపించారు. వీర మహిళలు ఎరుపు రంగు బెలూన్లు గాలిలోకి వదిలారు. వారాహి విజయ యాత్ర సభకు వేదిక అయిన సర్పవరం జంక్షన్ వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఆహ్వానం పలికారు.ఇక వేదిక వద్ద పవన్ కళ్యాణ్ చాలా పవర్ ఫుల్ ప్రసంగంతో వైసీపీ గుండెల్లో దడ పుట్టించారు.
ముఖ్యంగా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి పై చాలా ఫిర్యాదులు వచ్చాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. క్రిమినల్ గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి మన జీవితాలను ప్రభావితం చేస్తానంటే తాను ఒప్పుకోనని అన్నారు. రౌడీయిజం చేసే వాళ్లకు తానెప్పుడూ వ్యతిరేకినని.. తనను పాలించేవాళ్లు, సీఎంగానీ సగటు మనిషి కంటే నిజాయితీపరుడు అయి ఉండాలన్నారు. అంబేద్కర్ గురించి, గాంధీ, భగత్ సింగ్ గురించి చదువుకో అంటారు. కానీ పాలించే ఎమ్మెల్యే క్రిమినల్ అయితే ఏం చేయాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి దోపిడీదారుడైతే ఏం చేయాలి. సీఎం క్రిమినల్స్ కు అండగా ఉంటే ఏం చేయాలని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.
సినిమా నటుడుగా ఉన్నందుకే నా పొలిటికల్ జర్నీ ఆలస్యమైంది. 2009 నుంచే పాలిటిక్స్ లో ఉండి ఉంటే వైసీపీ అధికారంలోకి రాకుండే చేసేవాడ్ని అన్నారు పవన్. ఆవేశంగా కాదు ఆలోచించి మాట్లాడుతున్నాను. నా మాటలకు బాధ్యత తీసుకుంటానన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి అక్రమాలు, అవినీతిని చూస్తూ ఉరుకునేది లేదన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వద్ద 50 వరకు గూండాలు ఉన్నారు. మీ అందరూ పద్ధతి మార్చుకోవాలి. నాకు అవకాశం, అధికారం వచ్చిన తరువాత ఈ గూండాలని ప్రతి ఒక్కరిని వీధి విధి తన్ని తన్ని తీసుకెళ్తానన్నారు. ద్వారంపూడి నువ్వు ఆడబిడ్డల జోలికి వచ్చినా, మీ గూండాలు ఆడవాళ్లను బెదిరించినా.. మీ తాతను టీటీ నాయక్ తీసుకెళ్లినట్లే, ఎమ్మెల్యే ద్వారంపూడిని బేడీలు వేసి తీసుకెళ్తామన్నారు. వైసీపీ నేతలపై, సీఎంపై కోపం లేదు. కానీ వాళ్లు చేసే క్రిమినల్ చర్యల వల్లనే వాళ్లపై ఇంత కోపం వస్తుందని స్పష్టం చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…