Pawan Kalyan : జనసేనాని పవన్ కళ్యాణ్.. . కోనసీమ జిల్లాలో జోరుగా వారాహి విజయ యాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సభలో కూడా ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హలో ఏపీ.. బైబై వైసీపీ అనే నినాదంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్‌లో వారాహి విజయ యాత్రను కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన నరసాపురంలో యాత్ర సాగింది. ఈ సభలో వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గొంతు నుండి వచ్చే ప్రతి మాట వేల మంది ప్రజల మాట అని ఆయన అన్నారు. వారాహి యాత్ర బహిరంగ సభకు తరలివచ్చిన అశేష జనవాహినితో నరసాపురం బస్టాండ్ సెంటర్ కిక్కిరిసింది.
విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల వలన మనం చాలా బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఆ పెద్ద మనిషి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు. ఎన్ని కంపెనీలు వచ్చాయి. వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయి. బటన్లు నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నామంటున్న వైసీపీ ప్రభుత్వం నొక్కని బటన్లు ఏన్నో అంటూ పవన్ కళ్యాణ్.. సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. కొన్ని సందర్భాల్లో ఆవేశంతో ఊగిపోయారు. పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ బటన్, రాని ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్, నష్టపోయిన రైతు పరిహారం బటన్, ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్, మద్దతు ధర రాని కొబ్బరి సాగు బటన్ అంటూ పవన్ కళ్యాణ్.. నరసాపురం వారాహి విజయ యాత్ర సభలో వైసీపీని టార్గెట్ చేశారు.
![Pawan Kalyan : నా ముందు నువ్వెంత.. వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్.. Pawan Kalyan very much angry on ysrcp leaders](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-2-1.jpg)
నేను నేర్చుకోవడానికి ఎప్పుడు తపన పడుతుంటాను. డిగ్రీ చదవలేదు. ఎలకట్రానిక్ కోర్స్ చేశా, డిప్లమా చేశా. నాకు మా అన్నయ్యలు , తండ్రి ఉన్నారు. పేద వారికి ప్రభుత్వమే దిక్కు. అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ బటన్, మూతపడిన 8 వేల బడుల బటన్, కొత్త కాలువలు కాదు, కనీసం ఉన్న కాలువల పూడిక తీయలేకపోయిన బటన్, ఆరోగ్యశ్రీ అందక కోల్పోయిన ప్రాణాల బటన్, త్రాగునీరు దొరకని గ్రామాల బటన్, స్వయం ఉపాధి కల్పించలేని బటన్, కాన్పు కోసం డోలిలో వెళ్ళిన మహిళ బటన్, అప్పుల్లోకి తోసేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బటన్, ఆగిపోయిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన బటన్, నిరుద్యోగ యువత ఉపాధి బటన్, ఆడబిడ్డల మాన, ప్రాణాల బటన్ అంటూ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. సభలో ప్రసంగిస్తూ తన చిన్ననాటి జ్నాపకాలను పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకున్నారు. అలానే వైసీపీ నాయకులపై నిప్పులు చెరిగారు. నా ముందు వారెంత అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.