Manchu Manoj : మంచు ఫ్యామిలీలో ఇటీవలే ఓ శుభకార్యం జరిగింది. మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ కల్యాణం చాలా వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించి అప్పట్లో తెగ చర్చనీయాంశంగా మారింది. భూమా ఫ్యామిలీతో మోహన్ బాబు కి చాలా కాలంగా ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అయింది . గతంలోనే మౌనిక మరియు మనోజ్ లకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి మోహన్ బాబుకి వీరిద్దరి వివాహం ఇష్టం లేదు అన్న వార్తలు సైతం వినిపించాయి.
ఈ క్రమంలోనే విష్ణు ఈ వివాహ వేడుకలకు దూరంగా ఉన్నాడు.ఇక మనోజ్ వివాహాన్ని మంచు లక్ష్మీ దగ్గరుండి చేయించింది. ఈ క్రమంలోనే ఆమెపై రకరకాల రూమర్ సైతం రావడం జరిగింది. ఇక పెళ్లికి కొన్ని గంటల ముందు మోహన్ బాబు హాజరు కావడం జరిగింది ఇదిలా ఉంటే మనోజ్ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. వాష్ ది ఫిష్ టైటిల్ తో మనోజ్ ఒక కొత్త సినిమా ప్రకటించాడు .ఇక దీని తర్వాత ఒకటి రెండు సినిమాలతో బిజీ కానున్నాడు మనోజ్..అయితే మనోజ్ ఇప్పుడు తన రెండో భార్యతో పాటు సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది.
భూమ మౌనికకి ఇప్పటికే ధైరవ్ అనే కొడుకు ఉండగా, ఆయనతో సరదాగా గడుపుతున్నాడు. రీసెంట్‌గా మనోజ్ తన పెట్ డాగ్ తో పాటు ధైరవ్ తో సరదగా ఆడుతున్నాడు. ధైరవ్‌ని సొంత కొడుకులా భావిస్తున్న మనోజ్.. ఆ బుడతడితో చాలా సంతోషంగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మనోజ్‌కి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మనోజ్ సినిమాలకి దూరమై చాలా కాలం అయింది. ఆయన మళ్లీ ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు.