Pawan Kalyan : జూన్ 14 నుండి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లిన కూడా పవన్‌కి ఘన స్వాగతం లభిస్తుంది.దారిపొడవునా అభిమానులు, కార్యకర్తలు పవన్‌కి భారీ స్వాగతం పలుకుతున్నారు. కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర జరిపిన పవన్ కళ్యాణ్ కు కొందరు భారీ బహుమతులు కూడా ఇస్తున్నారు. అయితే అందరిని కలుపుకుంటూ,చర్చిస్తూ ముందుకు సాగుతున్నారు పవన్. నిన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం గ్రామంలో పవన్ బహిరంగ సభ జరపగా,ఆ ప్రాంతానికి భారీగా జనసందోహం హాజరయ్యారు.
పవన్ వారాహి టూర్‌తో రాష్ట్రంలో పాలిటిక్స్ హీటెక్కాయి. తన పర్యటనలో పవన్‌కళ్యాణ్ వైసీపీపై విరుచుకుపడుతుండగా, వారు కూడా పవన్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే పవన్ మాత్రం ఒక్కసారి తనకి అవకాశం ఇచ్చి చూపిస్తే మంచి పాలన అందిస్తామని చెప్పుకొస్తున్నారు. చూస్తుంటే ఈ సారి పవన్ కొన్ని స్థానాలలో పట్టు సాధించే అవకాశం ఉన్నట్టుగానే కనిపిస్తుంది. పవన్ రీసెంట్‌గా ముమ్మిడివరంలో బహిరంగ సభ జరపగా, అక్కడికి భారీగా జనసందోహం హాజరైంది.యువతీ యువకులు భారీ ఎత్తున హాజరయ్యారు.
![Pawan Kalyan : జనసేనాని బహిరంగ సభలో ఆడపిల్లల అల్లరి.. పవన్ రియాక్షన్‌కి ఫిదా కావల్సిందే..! Pawan Kalyan speech girls surprised by him](http://3.0.182.119/wp-content/uploads/2023/06/pawan-kalyan-1-7.jpg)
కొందరు యువతులు బాగా అల్లరి చేస్తుండడంతో వారిపై పవన్ దృష్టి పడింది.మిమ్మల్ని నేను గమనిస్తున్నాను. నాకు చాలా దూరంగా ఉన్న వాళ్లు కూడా కనిపిస్తున్నారు. వారికి నేను కనిపిస్తున్నానో లేదో అంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడుతున్నంత సేపు అక్కడి యువతలు ఒకటే అల్లరి చేస్తూ పవన్ దృష్టిని ఆకర్షించారు. ఇక సినిమాలకి గ్యాప్ ఇచ్చి రాజకీయాలతో బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్. పవన్ నటిస్తున్న తమిళ చిత్రం వినోదయ సీతమ్ అనే తమిళ సినిమాను తెలుగులో బ్రో అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్, సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.