సినిమాలపై సంచలన నిర్ణయం తీసుకున్న పవర్ స్టార్..!

పవన్ కళ్యాణ్.. చిరంజీవి తమ్ముడిగా పరిశ్రమలోకి వచ్చినా ఒక తరుణంలో పవన్ కళ్యాణ్ అన్నయ్యే చిరంజీవి అనిపించుకున్న స్టార్. అతను సాధించిన విజయాలన్నీ ట్రెండ్ సెట్ చేసినవే. ఈ కారణంగానే అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో బిజీ అవుతున్నాడు. దీంతో ఆయన మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులు అలస్యమవుతున్నాయి.

ముఖ్యంగా క్రిష్ జాగర్లపూడి డైరెక్షన్లో రాబోయే హరిహర వీరమల్లు షూటింగ్ కొవిడ్ సమయంలో మొదలైనా.. ఇంకా పూర్తవలేదు. వాస్తవానికి వకీల్ సాబ్ తరువాత హరిహర వీరమల్లు సినిమా రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఈ సినిమా తరువాత ప్రారంభించిన భీమ్లానాయక్ థియేటర్లోకి వచ్చి సందడి చేసింది. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లుతో పాటు హరిశంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. అయితే హరిహర వీరమల్లు సినిమా ఆలస్యమైనా హరిశంకర్ సినిమా కంప్లీట్ చేద్దామనుకున్నారు.

pawan kalyan took important decision on movies

కానీ ఆ డైరెక్టర్ స్టోరీ విషయంలో తాత్సారం చేయడంతో ప్రస్తుతం పవన్ రాజకీయాలకే పరిమితం అవుతున్నాడు. దీంతో పవన్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూనే ముందుగా హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ సినిమా పూర్తయిన తరువాతే మిగతా ప్రాజెక్టుల జోలికి వెళ్లాలని అనుకుంటున్నారట. అలాగే ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో ఆ తర్వాత ఎలాంటి ప్రాజెక్టులు లేకపోతే మొత్తంగా రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago