ఇటీవల అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలోనే భరత్ అనే నేను బ్యూటీ కియారా అద్వాని సైతం ఏడడుగులు వేసేందుకు సిద్ధమైందట. కియారా అద్వానీ .. కొన్ని సంవత్సరాలుగా సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమలో ఉన్నారని , వారు డేటింగ్ కూడా చేస్తున్నారని చాలా మందికి తెలుసు. ఇద్దరూ కలిసి సినిమాలు చేయడం, తరచూ యాత్రలకు వెళ్లడంతో అనుమానాలు మరింత పెరిగాయి. తాజాగా వీరి పెళ్లి గురించి బాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.
కొద్దికాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీలు మూడు మూళ్లు బంధంతో ఒక్కటి కాబోతున్నట్లుగా సమాచారం. డిసెంబర్ నెలలో వీరిద్దరి పెళ్లి అంగరంగా వైభవంగా ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి సినీ ప్రముఖులు మాత్రమే హజరు కానున్నారని.. ఇక ముంభైలో జరిగే రిసెప్షన్ కు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి వివాహం చండీగఢ్ లోని ది ఒబెరాయ్ సుఖ్విలాస్ స్పా అండ్ రిసార్ట్స్ లో జరగనుందని టాక్ నడుస్తోంది.
ఈ రిసార్ట్స్‌లో బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ పెళ్లి చేసుకున్నారు. సిద్ధార్థ్-కియారా పెళ్లిని ముందుగా గోవాలో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఆ తర్వాత సిద్ధార్థ్ కుటుంబాన్ని పరిగణనలోకి తీసుకుని వేదికను గుజరాత్‌కి మార్చినట్లు తెలుస్తోంది. ‘ఎంఎస్ ధోని’ సినిమాతో బాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వానీ. ఆ తర్వాత తెలుగులో రెండు సినిమాలు చేసింది. బాలీవుడ్‌లో బిజీగా ఉండడంతో సౌత్ సినిమాలకు డిమాండ్ తగ్గింది. ప్రస్తుతం రామ్ చరణ్-శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు సిద్ధార్థ్ ‘యోధ’, ‘మిషన్ మజ్ను’ సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాలు విడుదల కానున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…