అల్లువారబ్బాయి అల్లు శిరీష్ లవ్ ట్రాక్ గురించి నెట్టింట ఎన్నో వార్తలు చూశాం. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ యంగ్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ తో సీక్రెట్ ఎఫైర్ నడిపిస్తున్నాడని పెద్ద ఎత్తున టాక్ నడిచింది. ఇప్పుడు అదే జోడీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా అను ఇమ్మానియేల్ డేటింగ్ రూమర్స్ పై మాట్లాడుతూ.. ఆ వార్తలు నా వరకు వచ్చాయి. మా అమ్మ గారు నాతో చెప్పారు. ఇలా వార్తలు వస్తున్నాయని అమ్మ చెప్పి బాధపడింది. నిజానికి ఊర్వశివో రాక్షసివో చిత్రానికి ముందు శిరీష్ ని కలిసిందే లేదు.
ఆ మూవీ పూజా కార్యక్రమం రోజు పరిచయమయ్యాడు. డైరెక్టర్ స్టోరీ నేరేట్ చేశాక.. క్యారెక్టర్ డిస్కషన్ కోసం కాఫీ షాప్ లో కలిశాము. శ్రీ, సింధు పాత్రలను గురించి, వాటిని ఎలా చేయాలి వంటి విషయాలు మాట్లాడుకున్నాము. ఈ రోజుల్లో ఒక అమ్మాయి, అబ్బాయి కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటే ప్రేమ కథలు అల్లేస్తారు. అల్లు శిరీష్ తో నాకు స్నేహం ఉంది. ప్రేమించే చనువు కానీ, ఆకర్షణ కానీ లేదు. ఒక లవ్ మూవీలో నటించినా కూడా ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు. నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ కి జంటగా నటించాను.
అప్పటి నుండి అల్లు అరవింద్ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది. అల్లు అరవింద్ గారు నేరుగా శిరీష్ తో ఎఫైర్ రూమర్స్ గురించి అడిగారు. ఈ గాసిప్స్ గురించి మాట్లాడుకుంటూ మేము బాగా నవ్వుకున్నామని అను ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చింది. శిరీష్ తో స్నేహం మాత్రమే ఉందన్న అను, ప్రేమకు తావులేదన్నారు. ఇక కెరీర్ గురించి మాట్లాడుతూ.. అమెరికా నుండి నేరుగా పరిశ్రమకు వచ్చాను. యాక్టింగ్ రాదు. భాష రాక ఇబ్బంది పడ్డాను. ఆరేళ్ళలో 13 సినిమాలు చేయడం చిన్న విషయం కాదని అను ఇమ్మానుయేల్ చెప్పుకొచ్చింది. ఊర్వశివో రాక్షసివో నేడు విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…