Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పదవి అధిరోహించిన విషయం తెలిసిందే. ఇక పవన్ ఈ సారి మంత్రి పదవి దక్కించుకున్నందుకు జూన్ 26 నుండి 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ వారాహి దీక్షను నిర్వహించనున్నారు. ఇక దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వారాహి దీక్ష అంటే ఏమిటి అసలు ఎందుకు చేస్తారు? చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్ కల్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది కూడా జూన్ నెలలో పవన్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మకు పూజలు నిర్వహించారు. అప్పట్లో కూడా వారాహి మాత వార్తల్లో నిలిచారు. కాకపోతే ఈ సారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ దీక్ష చేపడుతుండటం విశేషంగా మారింది.
గతంలో కూడా పవన్ చాలా దీక్షలు చేపట్టారు. చాతుర్మాస దీక్ష చేశారు. నాలుగు నెలల పాటు ఈ దీక్షలో పవన్ కొనసాగారు. ఆషాడం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం మాసాల్లో పవన్ దీక్ష చేపట్టారు. ఆ దీక్షలో కూడా ఆహార నియమాలు పాటించారు. సాత్వికాహారం మాత్రమే తీసుకునేవారు. దీక్ష విరమించే సమయంలో హోమం కూడా నిర్వహించారు.ఇక వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించడం.. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలని సప్తమాతృకలుగా చెప్తారు. ఆమె ఏడు ప్రతి రూపాలను సప్తమాతృకలు అంటారు. దుర్గాదేవి సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించటంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. లలితా పరమేశ్వరి దేవి సర్వ సైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని చెబుతారు.
వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే శత్రువులను జయించడానికి జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయం ఉండదని చెబుతారు. అంతేకాదు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల నుండి మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి కూడా వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. ప్రతి సంవత్సరం జేష్ట మాసం చివరిలో ఆషాడమాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడుతారు. వారాహి దీక్షలో భాగంగా అమ్మవారిని పూజించడానికి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి, రెండు పూటలా అమ్మవారిని పూజ చేసుకుంటూ, సాత్విక ఆహారం తీసుకొని, నేలపై పడుకుని అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ వారాహి దీక్షను ఆచరిస్తారు. సాధారణంగా వారాహి దీక్షను తొమ్మిది రోజులైనా, 11 రోజులైనా చేయొచ్చు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…