Pawan Kalyan : ఇక వైసీపీకి బ్యాడ్ టైమా.. యుద్ధం ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్..

Pawan Kalyan : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత ఏపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా మారిపోయాయి. ఈ రోజు చంద్ర‌బాబుని క‌లిసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. తాను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు తెలియ‌జేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే టీడీపీతో చేతులు కలపాల్సిందేనని.. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని జనసేనాని అన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని గురువారం మధ్యాహ్నం పవన్ కలిశారు. నందమూరి బాలకష్ణ, నారా లోకేశ్ తో కలిసి.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయని క్లారిటీ ఇచ్చారు.

ఇక నుండి టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోరాటం కొనసాగిస్తాయని.. ఇందు కోసం రెండు పార్టీల నాయకులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీని ఎదుర్కొలేమని, సమిష్టిగా ఎదుర్కొవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఏపీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలన్న తన కోరికను వెల్లడించారు. తమతో కలిసి రావాలని బీజేపీని ఆయన కోరారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైసీపీకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు హస్తం ఎలా ఉంటుందని.. ఆయన ఏమైనా సంతకాలు పెట్టారా.. సంతకాలు పెడితే ఆధారాలు చూపాలని సీఐడీ అధికారులకు పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు.

Pawan Kalyan strong warning to ysrcp
Pawan Kalyan

ప్రతిపక్ష నేతలను వేధిస్తున్న అధికారులు, వైసీపీ నేతలు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలని.. సొంత అమ్మ, చెల్లిని పక్కన పెట్టి.. బాబాయ్ హత్య చేసిన వ్యక్తికి మీరెంత అని ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తాము అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదిలిపెట్టబోమని.. జగన్‌కు ఇంకా మిగిలింది ఆరు నెలలేనని పవన్ గుర్తు చేశారు. చంద్రబాబుతో విభేదాలు ఉన్నా.. అభిప్రాయ భేదాలు ఉన్నా అవి పాలనపరమైన విషయాల వరకే పరిమితం అని పవన్ కళ్యాణ్ అన్నారు. మీకు యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తామన్నారు. జగన్ కు మద్దతివ్వాలా లేదా అనేది వైసీపీ మద్దతుదారులు గుర్తుంచుకోవాలన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. ఓ మాజీ సీఎంని మీరు రిమాండ్ లో కూర్చోబెట్టినప్పుడు మీ పరిస్దితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. బీజేపీ కూడా దీనికి కలిసి వస్తుందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago