Pawan Kalyan : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ, నారా లోకేష్ కలవడం ఎంతద చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 40 నిమిషాల భేటీ తర్వాత బయటికి వచ్చిన పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. . అరాచకాన్ని అడ్డుకోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పనిచేయదని, సమిష్టిగానే ఎదుర్కోవాలన్నారు. వైసీపీ దుష్టపాలనను ఏపీ ప్రజలు తీసుకోలేరన్నారు.
తనలాంటి వ్యక్తిని తెలంగాణ సరిహద్దుల్లో 200 మంది పోలీసుల్ని పెట్టి ఆపారంటే సామాన్యుడి పరిస్ధితి ఏంటని పవన్ కళ్యాణ్ అన్నారు. తనను కూడా రానివ్వడం లేదని, మొన్నటి దాకా తానే నిర్ణయం తీసుకోలేదని, కానీ ఇప్పుడు జనసేన-టీడీపీ కలిసి వెళ్తాయని ప్రకటించారు. ఇది తమ ఇద్దరి భవిష్యత్తుకు సంబంధించిది కాదని, ఏపీ భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు. ఏపీలో అన్ని వ్యవస్ధల్ని దోచుకున్న వ్యక్తుల్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని పవన్ తెలిపారు. జగన్ నీకు ఆరునెలలు మాత్రమే ఉన్నాయని, ఈ ఆరునెలల్లోనే ఏం చేసినా అనేది జగన్ మద్దతుదారులు గుర్తుంచుకోవాలని పవన్ సూచించారు.
మీకు యుద్దమే కావాలంటే యుద్దమే ఇస్తామన్నారు. జగన్ కు మద్దతివ్వాలా లేదా అనేది వైసీపీ మద్దతుదారులు గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. బీజేపీ కూడా దీనికి కలిసి వస్తుందన్నారు. అరెస్ట్‌లతో సంబరాలు చేసుకోవడం దిగజారుడు తనం. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు, జగన్ అరెస్ట్ అయినప్పుడు సంబరాలు చేసుకోలేదు. ఇప్పుడు కొందరు చేసుకున్నారంటే అది వారి దిగజారుడుతనం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.చంద్రబాబుతో భేటీలో ఆయనకు ఇలాంటి దుస్ధితి రావడం బాధాకరమని చెప్పానన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశానన్నారు. తనకు ఎలాగో భద్రత లేదని, జైల్లోనూ చంద్రబాబుకు భద్రత లేదన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…