Pawan Kalyan : చిరంజీవి కాలి గోటికి కూడా మీరు స‌రిపోరు.. రోజా, నానిల‌కి గ‌ట్టిగా ఇచ్చిన ప‌వన్..

Pawan Kalyan : జ‌న‌సేన అధినేత ప‌వన్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు. వారాహి యాత్ర మూడో విడతలో భాగంగా విశాఖలోని జగదాంబ సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాని మాట్లాడారు. ‘‘వైసీపీని ఆంధ్రా నుంచి తన్ని తరిమేయాలి.. అది విశాఖ నుంచే కావాలి. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఒక్కడు చాలు. సీఎం జగన్‌కి , వైసీపీ గూండాలకు భయపడొద్దు. జగన్‌కి మేం బానిసలం కాదు.. మేము నీకెందుకు భయపడతాం. నేను ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. పొట్టి శ్రీరాములను గుర్తు పెట్టుకోవడం లేదు.. రాష్ట్రమంతా దోచుకున్నవారి వైఎస్ విగ్రహాలు ఉన్నాయి. సీఎం కావాలని నేను అనుకుంటే సరిపోదు.. మీరు అనుకోవాలి.’’ అని అభిమానులకు, కార్యకర్తలకు జనసేనాని పిలుపునిచ్చారు.

నాకు నటనలో పాఠాలు నేర్పి, మీ అందరికీ దగ్గర చేసిన విశాఖ నగరం నాకు అన్నం పెట్టిన నేల. జగదాంబ జంక్షన్ లో 25 ఏళ్ల క్రితం సుస్వాగతం సినిమా కోసం బస్సు మీద ఎక్కి డాన్స్ చేసినపుడు సిగ్గుతో ఉన్న నాకు, అదే జగదాంబ జంక్షన్ లో మళ్లీ లక్షలాది మంది జనం సాక్షిగా రాజకీయ ప్రసంగం ఇచ్చిన ప్రాంతం ఇది. ఉత్తరాంధ్ర మాండలీకం, సంస్కృతి మీద గౌరవం కలిగించిన విశాఖకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. విశాఖ నుంచి వైసీపీని పూర్తిగా విముక్తం చేసే వరకు మనం కలిసికట్టుగా పోరాడుతాం. మళ్లీ ప్రశాంత విశాఖను అంతే అందంగా సాధించుకుందాం అని ప‌వన్ క‌ళ్యాణ్ తెలియ‌జేశారు.

Pawan Kalyan strong counter to roja and kodali nani
Pawan Kalyan

ఎంపీ కుటుంబ సభ్యుల్ని ఒక రౌడీ కిడ్నాప్ చేశారు.. కానీ ఏమీ చేయలేక పోయారు. కరెంట్, పెట్రోల్ చార్జీలు పెంచారు. చెత్త మీద పన్ను వేశారు. ఎంత సేపు మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని అంటారు. వలంటీర్లు మీద నాకు ద్వేషం లేదు. మీ చేత జగన్ తప్పులు చేయిస్తున్నారు. ప్రజల డేటా హైదరాబాద్ వెళ్లి పోతుంది. మీకు రూ.5 వేలు ఇస్తున్నారు. కానీ నేను ఇంకో రూ. 5 వేలు ఇవ్వాలని అనుకునేవాడిని. వలంటీర్లు చేస్తుంది చట్టవిరుద్ధం. కొంత మంది వలంటీర్లు అక్రమాలకు, మోసాలకు పాల్పడ్డారు. జగన్‌తో చాలా డేంజర్.. అందరూ గ్రహించాలి అని ప‌వ‌న్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. ఇక త‌న అన్న‌య్య చిరంజీవిని రోజా, కొడాలి నాని వంటి వారు తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌గా, వారికి కూడా త‌న వ్యాఖ్య‌ల‌తో గ‌ట్టి స‌మాధానం ఇచ్చారు ప‌వ‌న్.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago