Bhola Shankar Movie Public Talk : మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. వాల్తేరు వీరయ్యతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి.. ఇప్పుడు భోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అజిత్ కథానాయకుడిగా తమిళంలో ఘనవిజయం సాధించి వేదాళం సినిమాకు రీమేక్ గా రూపొందింది. ఓ పాత కథను ఎంచుకొని అంతకుమించిన పాత పద్ధతుల్లో సినిమాను తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో అదే.. భోళాశంకర్. ఓటీటీలు అందుబాటులో ఉన్న ప్రస్తుత కాలంలో అన్ని భాషలకి సంబంధించిన సినిమాలు ప్రేక్షకులు చూస్తున్నారు.. అసలు చిరంజీవి వేదాళం రీమేక్ చేస్తున్నారు,దానికి మెహర్ రమేష్ దర్శకుడు అంటే పెదవి విరిచారు.
కథకు స్క్రీన్ ప్లేతోపాటు భావోద్వేగాలు (ఎమోషన్స్), హీరోయిజంలో కొత్త దనం లేకుండా, సినిమా మేకింగ్ లో ఎక్కడా చీమ దూరేంత కొత్తదనం లేకుండా సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే భోళాశంకర్. చిరంజీవి-వెన్నెల కిషోర్ మధ్య కామెడీ ట్రాక్ బెడిసికొట్టింది. లాయర్ లాస్య పాత్రలో తమన్నాకు, చిరంజీవి మధ్య వచ్చే సన్నివేశాలు చప్పగా సాగాయి. పాటలు, ఫైట్లు ఒకదానివెంట ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ వాటి ప్రభావం శూన్యం. సహజంగా ఒక్క సన్నివేశం కూడా లేదు. సినిమా రెండో భాగం ఆరంభమయ్యాక మొదటి భాగంతో పోలిస్తే కాస్తంత ఉపశమనం కలుగుతుంది. గ్యాంగ్ స్టర్ బోలాగా చిరంజీవి, తను చేసిన కామెడీ అక్కడక్కడా మెప్పిస్తుంది.
పవన్ కల్యాణ్ లా చేయాలనుకున్నదికానీ, శ్రీముఖితో చేసిన ఖుషి నడుము సన్నివేశాలు పూర్తిగా బెడిసికొట్టాయి. సినిమాలో కాస్తంత స్టైలిష్ గా, హుషారుగా కనిపిస్తారు చిరంజీవి. మెగా ఫ్యాన్స్ కొందరు కూడా ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఏమాత్రం కసరత్తులు చేయలేదని అర్థమవుతోంది అని అంటున్నారు. సినిమా రచనలో చిరంజీవిని ఉపయోగించుకునేంత బలం కనపడలేదు. కీర్తిసురేష్ పాత్ర వల్లే అక్కడక్కడా ఎమోషన్స్ పండాయి. పాటలు మినహా తమన్నాకు ప్రాధాన్యం దక్కలేదు. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో దారుణమైన ఫ్లాప్‌గా మిగిలింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…