Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నాయకులు దారుణమైన కామెంట్స్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వారిపై అదే రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబు గతంలో చేసిన డాన్స్ ను పోలుస్తూ నటుడు పృథ్వి క్యారెక్టర్ ఉంది. అంటే కాదు పేరు కూడా శ్యామ్ బాబు అని పెట్టడం మరింత వివాదానికి కారణమైంది. పైగా నటుడు పృథ్వి,ఇతర నటులు కూడా ఈ క్యారెక్టర్‌పై చేసిన కామెంట్స్ మంత్రి అంబటి రాంబాబుకు చిర్రెత్తుకొచ్చేలా చేసాయి. మొదటి రోజు పెద్దగా పట్టించుకోని అంబటి.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలతో తీవ్ర స్థాయిలో స్పందించారు.
సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని అందుకే వివాదాలు సృష్టించి కలెక్షన్లు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనంను తన కాళ్ళ కింద పెట్టుకోవడంతో అమ్మవారికి కోపం వచ్చిందని అన్నారు. పవన్ కళ్యాణ్ జీవితంపై త్వరలో సినిమా తీస్తున్నట్లు మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ఈ సినిమాకు బ్రో టైటిల్ మాదిరిగా మ్రో అని పెడతామన్నారు. మ్యారేజెస్/రిలేషన్స్-అఫెండర్ ను కలిపి మ్రో అనే పేరు పెట్టే ఆలోచన ఉందన్నారు. ఆ సినిమా స్టొరీ ఎంటనేది కూడా మంత్రి అంబటి వివరించారు. ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో జనసైనికులు కూడా అంబటి రాంబాబుపై సినిమా తీస్తామని చెప్పి పలు టైటిల్స్ అనౌన్స్ చేశారు.
ఇక రచ్చ పీక్స్‌కి వెళుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ స్పందించినట్టు తెలుస్తుంది. నా సంస్కారమే నా బలహీనం. నా తల్లిదండ్రులు నేర్పిన నా సంస్కారం కొన్ని సార్లు నాకు అడ్డొస్తుంటుంది. నన్ను ద్వేషించిన నా శత్రువు ఇంటికి వచ్చిన కూడా అన్నం పెట్టి పంపిస్తాను. వారి నా దగ్గరకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తాను. విబేధాలు ఉండొచ్చేమో కాని వారు నా దగ్గరకు వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానిస్తాను అని పవన్ కళ్యాణ్ అన్నట్టు తెలుస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…