Chittibabu : బ్రో సినిమా ఏపీ రాజకీయాలలో ప్రకంపనలు పుట్టిస్తుంది. తనను కించపరచాలనే బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ …శ్యాంబాబు క్యారెక్టర్‌ను పెట్టాడని అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ నాయకులు ఇచ్చిన డబ్బుతోనే విశ్వప్రసాద్ బ్రో సినిమా తీశాడంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి సినిమాలు తీస్తే దర్శకరచయితలకు తగిన గుణపాఠం చెప్పాల్సివస్తుందని త్రివిక్రమ్ కి కూడా వార్నింగ్ ఇచ్చాడు అంబటి. అయితే ఈ కామెంట్స్‌పై బ్రో ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ రియాక్ట్ అయ్యాడు. అంబటి రాంబాబువి ఉట్టి గాలిమాటలేనని తెలిపాడు. ఆయన మాటల్ని తాను సీరియస్‌గా తీసుకోవడం లేదని పేర్కొన్నాడు. ఒకవేళ సీరియస్‌గా తీసుకుంటే లీగల్‌గానే అంబటిని ఎదుర్కొనేవాడినని విశ్వప్రసాద్ అన్నాడు.
తన మీద ఎక్కడ, ఎవరికి కంప్లైంట్స్ చేసుకున్నా ఇబ్బందిలేదని తన సొంత డబ్బుతోనే ఈ సినిమా తీశానని విశ్వప్రసాద్ పేర్కొన్నాడు. ఈ సినిమా మేకింగ్‌లో తాను ఎలాంటి తప్పులు చేయలేదని తెలిపాడు. అంబటిరాంబాబు కామెంట్స్ వల్ల తమ సినిమాకు పబ్లిసిటీ పెరుగుతోందని, అందువల్లే అతడి కామెంట్స్‌ను తాను నెగెటివ్‌గా తీసుకోవడం లేదని విశ్వప్రసాద్ చెప్పాడు.ఇక ప్రముఖ నిర్మాత చిట్టిబాబు సైతం ఈ వివాదంపై స్పందించాడు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్. ఫన్ కోసం సెటైరికల్‌గా పెడతారు. అంబటి రాంబాబు పబ్లిక్‌గానే డ్యాన్స్ చేశారు. ఆయన సీక్రెట్‌గా చేసింది బయట పెట్టలేదు కదా అని ఆయన అన్నారు.
అయితే వైసీపీ ఆస్థాన దర్శకుడు ఇతరులని కించ పరిచే విధంగా, కులాలని అపహాస్యం చేసేలా సినిమా తీస్తున్నప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు. కొందరిని పోలిన పాత్రలు చూపిస్తూ రచ్చ చేస్తున్నాడు కదా. ఇలా కులాల గురించి మాట్లాడడం తప్పు అని చెప్పలేదు కదా. వ్యూహం అనే ఏదో సినిమా చేస్తున్నాడు. దాని గురించి కూడా ఏం మాట్లాడడం లేదు కదా. మీరు సినిమా పరిశ్రమ మూల్యం చెల్లించాలి అంటూ పిచ్చ పిచ్చ వాగుడు వాగితే మీ పార్టీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. 15 సీట్లు రావు. సినిమా తీయోద్దని నిన్ను అన్నాడా.. నువ్వు తీస్తా అని ఎవరిని బెదిరిస్తున్నావు..సమాజంలో ఉన్న అన్ని రంగాల మీద సెటైర్స్ వేస్తారు కామన్. నువ్వు చేసిందే కదా చూపించింది. దేనికి అంత ఏడుపు. నీ సరసాలని పెట్టి ఉంటే బాగుండేది. సినిమా పవర్ ఏంటో నీకు తెలియదు అంటూ చిట్టిబాబు ఫైర్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…