Ambati Rambabu : బ్రో సినిమా రిలీజ్ తర్వాత అంబటి రాంబాబు హాట్ టాపిక్ గా నిలిచారు. అందుకు కారణం ఆయనని బ్రో సినిమాలో శ్యాంబాబు పేరుతో కించపరచడమే. సినిమా చూసిన వారందరు కూడా అంబటి రాంబాబు పాత్రని సినిమాలో పెట్టారని అన్నారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు కూడా దీనిపై ఫైర్ అయ్యారు. బ్రో సినిమాలో నాపై సెటైర్లు వేశారు కాబట్టి తాను మాట్లాడుతున్నా అన్నారు. వేరే సినిమాల గురించి తాను మాట్లాడడం లేదు కదా అన్నారు. ఇరిగేషన్ గురించి తాను వేసిన ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పలేకపోయాడని రాంబాబు తెలిపారు. మరోవైపు ఆయన పవన్ పెళ్లిళ్ల గురించి సినిమా చేయాలనుకుంటున్నానని త్వరలోనే ఈ సినిమా తీస్తానంటూ కొన్ని టైటిల్స్ కూడా ప్రకటించారు.
‘నిత్య పెళ్లి కొడుకు’, ‘మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు’.. ఇలా పలు టైటిల్స్ అంబటి అనౌన్స్ చేయడంతో దీనికి సమాధానంగా జనసైనికులు అంబటి పై సినిమా తీస్తామంటూ పలు టైటిల్స్ అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ ని కూడా ఆవిష్కరించారు. ‘కాంబాబు రాసలీలలు’ అనే టైటిల్ ని పెట్టారు. ఈ సినిమాకి కొల్లేరుకు చెందిన జనసేన మత్స్యకార విభాగ రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఏలూరు జనసేన నాయకుడు చందు తాతపూడి ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. కాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో.. “పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ప్రొడక్షన్ నెంబర్ 420, కామం స్టార్ అంబటి కాంబాబు హీరో అని ఉంది.
అంతేకాదు కాంబాబు రాసలీలలు టైటిల్ కింద ‘సంజన, సుకన్య’ అంటూ క్యాప్షన్ పెట్టి అంబటి రాంబాబు ఫోటోని పోస్టర్ లో డైరెక్ట్ గా వేయడం ఇప్పుడు వివాదం అవుతుంది. అలాగే త్వరలో గంటా, అరగంట టైటిల్స్ తో కూడా సినిమాలు తీయబోతున్నట్లు ప్రకటించారు. సంబరాల ఆంబోతు, ముసలోడే కాని మనసులో ఏముంది, శ్యాంబాబు విత్ లపాకీ బట్ నో తుపాకి.. ఇది ఏ సర్టిఫికెట్ సినిమా అని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి మార్పులు ఏమైన ఉంటే తెలియజేయగలరు అంటూ కూడా జనసైనికులు తెలియజేశారు. ఇదిలా ఉంటే అమెరికా నుంచి బ్రో మూవీకి అక్రమ ఫండింగ్ జరిగిందని, ఈ మూవీ లావాదేవీల పై పిర్యాదు చేయడానికి అంబటి ఢిల్లీ కూడా వెళ్లనున్నారని ప్రచారం జరుగుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…