ఇటీవల కాలంలో మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో అర్థం కాని విధంగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు మనుషుల ప్రాణాలు తీసేందుకు ముంచుకొస్తున్న తరుణంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మొన్నటి వరకు కరోనా వైరస్ తో ప్రతిరోజు దినదిన గండం గానే బ్రతికాడు మనిషి. ఇక ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం తగ్గింది అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో.. సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా మనిషి ప్రాణం ఏ క్షణంలో పోతుందో కూడా ఊహించలేని విధంగా మారిపోయింది. ఇక ఇవన్నీ చాలవు అన్నట్లు మరికొన్నిసార్లు అనూహ్యమైన ఘటనలు కూడా ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి.
ప్రతిరోజూ మనం చేసే పనుల కారణంగానే చివరికి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. వర్షాకాలం వలన ప్రతి ఒక్కరు స్నానానికి ముందు నీటిని వేడి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా హీటర్ వాడుతున్నారు. ఆ హీటర్ కారణంగా ప్రాణాలు పోతాయి అంటే ఎవరైనా నమ్ముతారా. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా హీటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఒక మృతి చెందింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాసి హనుమంత రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. తల్లిదండ్రుల కలలు, ఆశలపై నీళ్లు జల్లి కానరాని లోకాలకు తరలి వెళ్లిపోయింది.
హనుమంత రెడ్డి, పుష్పలత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె నిఖితా రెడ్డి(15). ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. ఉదయం స్నానం చేసేందుకు బాత్రూములోకి వెళ్లింది. కుళాయిని తిప్పుతుండగా.. కరెంట్ షాక్ కొట్టి అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె అరుపులకు విన్న తల్లిదండ్రులు ఆమెను బాత్రూమ్ నుండి బయటకు తీసుకు వచ్చే సరికి విగతజీవిగా కనిపించింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు నిర్ధారించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా కుళాయికి విద్యుత్ సరఫరా జరిగి.. షాక్ తగిలి చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నారు. ఒక్కాగానొక్క కుమార్తె చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బాధ వర్ణనాతీతం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…