Pawan Kalyan : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్ర ను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. రీసెంట్‌గా కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించగా, ఈ యాత్రలో భారీగా యువకులు, పవన్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక పర్యటనలో పవన్ యువతని ఉద్దేశిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమా వేరు, రాజకీయం వేరు అని చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్.. సినిమా పరంగా రాష్ట్రంలోని యువత ఏ హీరోని అయినా ఇష్టపడడంలో తప్పులేదని అన్నారు.
అయితే రాష్ట్ర ప్రయోజనాలు దగ్గరకి వచ్చేపాటికి యువత ఆలోచించాల్సి ఉంటుందని గుర్తు చేశాడు. తన తోటి నటీనటులు అంటే తనకెంతో గౌరవం ఉందని, వారి సినిమాలను కూడా చూస్తానని వెల్లడించిన పవన్.. రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ , ప్రభాస్ , చిరంజీవి అంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు వారి సినిమాలను కూడా తాను చూస్తాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోల గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన ఒకవైపు వారాహి యాత్ర చేపడుతూనే మరోవైపు సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
వారాహి యాత్ర పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అయితే ఈ యాత్రలో రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్.. ఒక్కోసారి సినిమా సంగతుల గురించి కూడా పలు విషయాలు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ ,, హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి చేయడానికి ఆయా సినిమా నిర్మాతలు పవన్ ఎక్కడ ఉంటే అక్కడ షూటింగ్స్ జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…