Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు, రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నారు. త్వరలో ఏపీలో ఎన్నికలు రానున్న క్రమంలో పవన్ కళ్యాణ్ రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఒక ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్‌లో కనిపించి సందడి చేశారు. ఒక తెలుగు టీవీ ఛానల్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకి చెందిన నటులు, దర్శకనిర్మాతలు కూడా అటెండ్ అయ్యారు. ఇక ఈ వేదిక పైనే దాదాపు 18 ఏళ్ళ తరువాత మళ్ళీ పవన్ కళ్యాణ్.. తన ఆన్ స్క్రీన్ అబ్బాయితో కలిసి కనిపించాడు. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ నటించిన ‘బాలు’ సినిమా మన అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో.. ఇప్పటి యువ హీరో ‘తేజ సజ్జా’ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అలరించారు. ఆ మూవీలో పవన్, తేజ బాబాయ్-అబ్బాయిగా నటించారు. సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆన్ స్క్రీన్ పై వీరిద్దరూ చేసిన అల్లరి ఆడియన్స్ ని మాత్రం బాగా ఆకట్టుకుంది. 2005లో ఈ మూవీ రిలీజ్అ య్యింది. ఆ తరువాత వీరిద్దరూ కలిసి మళ్ళీ ఏ సినిమాలో కనిపించలేదు. కాని తాజాగా ఈ ఇద్దరు ఒకే ఫ్రేములో కనిపించి ఆడియన్స్‌కి మంచి వినోదం పంచారు.
18 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు కలిసి ఒక ఫ్రేమ్ లో కనిపించడంతో ఆడియన్స్ కూడా.. ఆ ఫోటోలకు లైక్స్ కొడుతూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ అబ్బాయి తేజ.. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. తేజ నటిస్తున్న సూపర్ హీరో మూవీ హనుమాన్.. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంద్ర, బాలు, కలిసుందాం రా వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం నుండి ప్రధాన నటుడిగా మారే వరకు, తేజ సజ్జ నిజంగా తన సినీ కెరీర్‌లో చాలా ముందుకు సాగాడు అని చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…