Amala Paul : అమలాపాల్.. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు లేరు. బెజవాడ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ 2012లో లవ్ ఫెయిల్యూర్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 2013లో నాయక్ సినిమాలో కనిపించి అదరగొట్టింది. అల్లు అర్జున్ తో కలిసి ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. జెండాపై కపిరాజు, మేము, ఆమె వంటి చిత్రాల్లోనూ కనిపించి తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాధించుకుంది.
కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి మెప్పించిన ఈమె.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఓవైపు సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తుంటుంది. ఈ అమ్మడికి గతంలో పెళ్లి జరగగా, ఆ పెళ్లి పెటాకులు అయింది. ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. నటి అమలా పాల్ తన నిశ్చితార్ధం వీడియోతో ఒక్కసారిగా మళ్లీ వార్తల్లో నిలిచారు. తన బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‌తో నిశ్చితార్ధం జరిగినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోబోతున్న జగత్ దేశాయ్ ఎవరు అని ఆరాలు తీస్తున్నారు.
తన 32 వ బర్త్ డే రోజు ఆమె బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. జగత్ దేశాయ్ ఆమెకు నేలపై కూర్చుని ప్రపోజ్ చేయడమే కాదు .. వేలికి రింగ్ తొడిగాడు. వెంటనే అమలా అతనికి ముద్దిచ్చింది. ‘ నా జిప్సీ క్వీన్ ఎస్ అంది’ అనే శీర్షికతో జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసాడు. దాంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…