వైసీపీ నుంచి రాష్ట్రాన్ని ర‌క్షిస్తాం.. సీఎం ప‌ద‌వి అక్క‌ర్లేదు.. జ‌న‌సేనాని సంచ‌ల‌న వ్యాఖ్యలు..

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి తీసుకొమ్మ‌ని ఏ పార్టీ అడ‌గ‌ద‌ని జ‌న‌సేన (Jensena) అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. తానైతే చంద్ర‌బాబును (Chandrababu Naidu) కానీ బీజేపీ అధ్య‌క్షుడిని కానీ సీఎం (CM) ప‌ద‌వి తీసుకోవాల‌ని అడ‌గ‌న‌ని చెప్పారు. భాగ‌స్వామ్య ప‌క్షాల‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికోసం డిమాండ్ చేయాలంటే క‌నీసం 30, 40 స్థానాలు రావాల‌ని తెలిపారు. సీఎం ప‌ద‌వికోస‌మే తాము ప‌నిచేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. చాలామంది త‌మ‌ను పెద్ద‌న్న‌పాత్ర‌వ‌హించాల‌ని అంటున్నార‌ని, అలా చేయాలంటే బాధ్య‌త‌వ‌హించ‌డ‌మ‌ని.. దానిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల‌ని సూచించారు. తాము రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోస‌మే ప‌నిచేస్తామ‌ని చెప్పారు. అమ‌రావ‌తిలో పార్టీ నేత నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ మీడియాతో మాట్లాడారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే జూన్ నుంచి ఇక్క‌డే ఉండి పూర్తిస్థాయిలో ప‌నిచేస్తాన‌ని తెలిపారు.

త‌మ‌కు గౌర‌వ‌ప్ర‌దంగా ఉంటే భాగ‌స్వామ పార్టీల‌తో క‌లిసి ముందుకు వెళ్తామ‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ దాష్టీకాన్ని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటామ‌ని స్ప‌ష్టం చేశారు. జ‌న‌సేన‌కు గ‌తంలోకంటే బ‌లం పెరిగింద‌న్నారు. రాయ‌ల‌సీమ లాంటి ప్రాంతాల్లో ప‌టిష్ఠంగా లేక‌పోయినా త‌మ‌కు ప‌ట్టున్న ప్రాంతాల్లో 30 శాతం బ‌లం పెంచుకున్నామ‌న్నారు. రాష్ట్ర భ‌విష్య‌త్తును ర‌క్షించ‌డానికి, వైసీపీ నుంచి ఏపీకి విముక్తి క‌ల్పించ‌డానికే పార్టీని స్థాపించాను త‌ప్ప తానొక్క‌డి కోసం కాద‌న్నారు.

pawan kalyan interesting comments on cm post

ముఖ్య‌మంత్రి ప‌ద‌వి తానై వ‌రించాలికానీ.. దాని కోసం వెంప‌ర్లాడ‌న‌ని స్ప‌ష్టం చేశారు. రాజ‌కీయాల్లో నిస్వార్థంగా ఉండాల‌న్నారు. తాను ప‌ద‌వుల‌కోసం పాకులాడే వ్య‌క్తిని కాద‌న్నారు. సినిమాల్లో కూడా త‌న‌ను ఎవ‌రూ సూప‌ర్ స్టార్‌ను చేయ‌లేద‌ని, ఆ హోదాను తానే సాధించుకున్నాన‌ని చెప్పారు. రాజ‌కీయాల్లో కూడా ఒక పార్టీ త‌న‌ను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ఎందుకు అనుకుంటుంద‌ని జ‌న‌సేనాని అన్నారు. సీఎం ప‌ద‌వి తీసుకోవాల‌ని టీడీపీ అధ్య‌క్షుడిని, బీజేపీ అధ్యక్షుడిని తానైతే అడ‌గ‌న‌ని స్ప‌ష్టం చేశారు. మ‌న స‌త్తా చూపి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి తీసుకోవాల‌న్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను కాపాడాల‌నేదే త‌న కండిష‌న్ అన్నారు. పొత్తుల ద్వారా వైసీపీ నుంచి అధికారాన్ని తీసుకుని ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పారు.

రోడ్లు స‌రిగా లేక‌పోవ‌డంతో వైసీపీ స‌ర్పంచ్ ప్ర‌మాదానికి గురై చ‌నిపోయారని, గ్రామీణ వ్య‌వ‌స్థ‌ను చంపేశార‌ని విమ‌ర్శించారు. నిధులు ఇవ్వ‌న‌ప్ప‌డు ఎంత‌మంది సర్పంచులు గెలిస్తే ఏముంద‌ని విమ‌ర్శించారు. కేర‌ళ త‌ర‌హాలో పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌న్న‌దే త‌మ ఉద్దేశ‌మ‌న్నారు. గ్రామీణ స్వ‌రాజ్యం రావాలంటే పంచాయ‌తీరాజ్ వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్ఠ‌ చేయాల‌న్నారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే ప‌లువురు స‌ర్పంచుల‌కు లేఖ‌లు రాస్తున్నామ‌ని, వారితో స‌మావేశ‌మ‌వుతామ‌ని చెప్పారు.

విమ‌ర్శ‌లు లేకుండా రాజ‌కీయాలు ఉండ‌వ‌ని ప‌వ‌న్ అన్నారు. ప్ర‌జ‌ల కోసం తాను ఎవ‌రితోనైనా తిట్టించుకోవాడానికి సిద్ధంగా ఉన్న‌ని చెప్పారు. కువిమ‌ర్శ‌ను బ‌లంగా ఎదుర్కొంటామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌తో న‌డిచేవారే త‌న‌వార‌ని, త‌మ పార్టీ ద్వారా రాష్ట్రం కోస‌మే ప‌నిచేస్తున్నాన‌ని వెల్ల‌డించారు. ఉన్న‌త‌మైన దృష్టితో చూస్తే తాను అంద‌రికీ అర్ధ‌మ‌వుతాన‌ని, ఒక పార్శ్వంలోనే చూస్తే ఇంకోలా క‌నిపిస్తాన‌ని.. దానికి తానేమీ చేయ‌లేన‌ని తెలిపారు. అన్నింటికీ సంసిద్ధంగా ఉండి.. త‌మ‌వంతు ప్ర‌య‌త్నం చేస్తే ప‌ద‌వ‌నేది త‌నంత‌ట తానే వ‌స్తుంద‌ని చెప్పారు. ప‌ల్లంలోకే నీళ్లొస్తాయ‌ని, క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌రించి తీరాల‌న్నారు. తాము దానికోస‌మే ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు.

Share
Ganesh Sunkari

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago