సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలతోనూ ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఆయన పేరు చెబితే అభిమానులకి పూనకాలు రావడం గ్యారెంటీ. టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన పవన్ చాలా సింపుల్‌గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. అందుకే ఆయనని చాలా మంది ప్రేమిస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ తన బర్త్ డే వేడుకలని కూడా చాలా సాదా సీదాగా జరుపుకున్నారు. అయితే అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రం పవన్ బర్త్ డే వేడుకలని అట్టహాసంగా సెలబ్రేట్ చేశారు.
ఇక పవన్ పుట్టినరోజు సందర్భంగా నాగబాబు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చూడడమే నా లక్ష్యం. యుద్ధం మొదలుపెట్టాడు, వెనక్కి తగ్గేది లేదు. ఆయనను ముఖ్యమంత్రిగా చూసేందుకు నా సర్వస్వం ధారబోస్తాను.. అని నాగబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ డబ్బుని కూడబెట్టడు. టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో అతడే అయినా తన డబ్బును పొదుపు చేసి పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశం అతనికి లేదు. పార్టీ లేదా ప్రజా సేవ కోసం తన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేస్తాడు.
పవన్ కళ్యాణ్ ఎక్కువ భాగం డబ్బుని సేవా కార్యక్రమాలకే వినియోగిస్తాడు. చాలా సంవత్సరాల క్రితం శంకరపల్లిలో 8 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఇది ఇప్పుడు బంగారంగా మారిందని మెగా బ్రదర్ నాగబాబు అభిప్రాయపడ్డారు. ఇందులో పవన్ ఫామ్ హౌజ్ నిర్మించుకోనున్నట్టు తెలుస్తోంది. ఖాళీగా ఉంటే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతారు. ప్రశాంత వాతావరణంలో వ్యవసాయం చేయడం, పశువుల పోషణ చూసుకోవడం ఆయనకు ఇష్టమైన చర్య. ఈ కార్యక్రమాలన్నీ ఆయన తన ఫామ్ హౌస్ లో నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఫామ్ హౌస్ లో పండిన ఆర్గానిక్ పండ్లు ఇష్టమైన వారికి పంపడం పవన్ కున్న మరొక అలవాటు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…