సాధారణంగా టాప్ హీరోల ఫ్యామిలీ విషయాలలో ప్రతి ఒక్కరూ తలదూరుస్తుంటారు అనే విషయం తెలిసిందే. వారు ఎంత కలివిడిగా ఉన్నా కూడా ఏదో ఒక చిచ్చు పెడుతూనే ఉంటారు. సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి పుకార్లు బాగా ఎక్కువయ్యాయి. కొన్నాళ్లుగా మెగా వర్సెస్ అల్లు వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యుల సంగతెలా ఉన్నా ఇరువురి అభిమానులు మాత్రం వివాదాన్ని రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా సాక్షిగా వార్ పెరుగుతోంది. అల్లు అర్జున్‌తో మెగా ఫ్యామిలీకు దూరం ఉందనే విషయాన్ని ఫ్యాన్స్ ధృవీకరిస్తూ రచ్చ చేసిన విషయం తెలిసిందే.
గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని సరైనోడు సక్సెస్ మీట్‌లో అల్లు అర్జున్ ను అభిమానులు అడిగితే.. చెప్పను బ్రదర్ అంటూ ఓ డైలాగ్ వేశాడు అల్లు అర్జున్. దీనికి పవన్ ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ ను భారీగా ట్రోల్ చేశారు. అప్పటి నుండి కొందరు పవన్ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ ను మెగా హీరోగా చూడబోమని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేశారు. ఇక రాజకీయాల పరంగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎలా అండగా నిలబడాలి.. ఏ రకంగా దానిని ముందుకు తీసుకెళ్లాలి అనే పరోక్ష అంశం పైనే ఇటీవల ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో భాగంగా వేసిన ఫ్లెక్సిలలో అల్లు అర్జున్ ఫోటో లేదా పేరు వంటిది కబడలేదు. దీంతో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో వార్ నడుస్తుందనే ప్రచారం జరిగింది.
అయితే కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య రచ్చ నడుస్తుందని పుకార్లు పుట్టిస్తున్న నేపథ్యంలో అల్లు అరవింద్ వీటికి చెక్ పెట్టాడు. మా కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇది వరకు ఉన్న బంధుత్వం పదిలంగా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అందువలనే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి. షూటింగ్స్ లో బిజీగా ఉండటం వలన అందరూ ఒకేసారి కలవలేక పోవచ్చు. పరిశ్రమలో పెద్దవాళ్లపై ఇలాంటి పుకార్లు పనిగట్టుకుని ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మొత్తానికి రెండు ఫ్యామిలీల మధ్య ఎలాంటి గొడవలు లేవని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలకు చెక్ పడుతుందా.. లేదా.. అనేది చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…