Pawan Kalyan : ఓడించిన గాజువాక ప్ర‌జ‌ల‌కి న‌మ‌స్కారాలు.. హార్ట్ ట‌చింగ్ స్పీచ్ ఇచ్చిన ప‌వ‌న్..

Pawan Kalyan : ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైజాగ్‌లో వారాహి యాత్ర చేస్తున్న విష‌యం తెలిసిందే. మొన్న జ‌గ‌దాంబ సెంట‌ర్‌లో వైసీపీపై తీవ్రంగా విరుచుకుప‌డ్డ జ‌న‌సేనాని నిన్న గాజువాక‌లో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. గాజువాక తన నియోజకవర్గమని, మన నియోజకవర్గమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న‌న్ను ఓడించిన ఈ ప్రాంతంలో ఇంత ఆద‌ర‌ణ ద‌క్కడం చాలా ఆనందంగా ఉంది. తనను ఓడించి దోపిడీ చేసే వైసీపీని గెలిపించారని వ్యాఖ్యానించారు. జగన్ దోపిడీ చేస్తారని తెలిసినా 151 సీట్లు ఇచ్చారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోనే భవన కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని, వెనక్కి తగ్గనని తెలిపారు.

ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే, కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే దేవుడొచ్చాడని అంద‌రు అనుకున్నారు. జగన్ రెడ్డిని నమ్మారు. 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు. జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది.. ఈయన దేవుడు కాదు.. దెయ్యమై భుజాల మీదకెక్కాడు అని తెలుకున్నారు. జగన్‌కు అదృష్టం అందలం ఎక్కిస్తే… బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్‌ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ ఉండక తప్పదు అని ప‌వన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం మనసులో ఆ దెయ్యం మీద ఉన్న కోపాన్ని ఓట్ల రూపంలో వేసి తరిమికొట్టండి” అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.

Pawan Kalyan heart touching speech in gajuvaka
Pawan Kalyan

వైసీపీ నేతలకు పార్లమెంట్‌లో ప్లకార్డు ప్రదర్శించే దమ్ముందా..? స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని అమిత్ షాకు చెప్పాను. స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర పెద్దలకు చెప్పా. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని సూచించా. ప్రజల కోసం పోరాటం చేసేవారినే ఎన్నుకోవాలి. కేసులు ఉన్నవారికి ప్రశ్నించడానికి ధైర్యం ఎలా వస్తుంది.? నిస్వార్ధంగా ప్రజల కోసం నిలబడేవారికే ధైర్యం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి.. డబ్బు తీసుకుని ఓటు వేస్తే నేనేమీ చేయలేను. విభజన వేళ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని ఒక్క ఎంపీ అడగలేదు. ప్రజల మద్దతు లేకపోతే నేనేం చేయలేను. రౌడీ ఎంపీ ఏం చేస్తారు? క్రైస్తవ సంస్థల భూమి దోచుకుంటారు? ఏ పదవి లేని నేనే ప్రధాని, హోంమంత్రి వద్దకు వెళ్తున్నా. స్వార్థం లేకుండా ఉంటే ప్రధాని ప్రధాని, హోంమంత్రి అన్నీ వింటారు అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago