Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైజాగ్‌లో వారాహి యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న జగదాంబ సెంటర్‌లో వైసీపీపై తీవ్రంగా విరుచుకుపడ్డ జనసేనాని నిన్న గాజువాకలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. గాజువాక తన నియోజకవర్గమని, మన నియోజకవర్గమని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో జనసేన జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నన్ను ఓడించిన ఈ ప్రాంతంలో ఇంత ఆదరణ దక్కడం చాలా ఆనందంగా ఉంది. తనను ఓడించి దోపిడీ చేసే వైసీపీని గెలిపించారని వ్యాఖ్యానించారు. జగన్ దోపిడీ చేస్తారని తెలిసినా 151 సీట్లు ఇచ్చారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన నెలలోనే భవన కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని, వెనక్కి తగ్గనని తెలిపారు.
ఎన్నికల ముందు బుగ్గలు నిమురుతుంటే, కనిపించిన వారిందరికీ ముద్దులు పెడుతుంటే దేవుడొచ్చాడని అందరు అనుకున్నారు. జగన్ రెడ్డిని నమ్మారు. 151 సీట్లను ఇచ్చి దేవుడుకి దణ్ణం పెట్టారు. జగన్ పాలన మొదలయ్యాక ప్రజలకు అర్ధం అయింది.. ఈయన దేవుడు కాదు.. దెయ్యమై భుజాల మీదకెక్కాడు అని తెలుకున్నారు. జగన్‌కు అదృష్టం అందలం ఎక్కిస్తే… బుద్ధి బురదలోకి లాక్కెళ్లింది. జగన్‌ను ప్రజలు మరో ఆరో నెలలు భరించక తప్పదు. జగన్ ఎన్ని వేషాలు వేసినా ప్రజలు చూస్తూ ఉండక తప్పదు అని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం మనసులో ఆ దెయ్యం మీద ఉన్న కోపాన్ని ఓట్ల రూపంలో వేసి తరిమికొట్టండి” అని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు.
వైసీపీ నేతలకు పార్లమెంట్‌లో ప్లకార్డు ప్రదర్శించే దమ్ముందా..? స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని అమిత్ షాకు చెప్పాను. స్టీల్ ప్లాంట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర పెద్దలకు చెప్పా. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని సూచించా. ప్రజల కోసం పోరాటం చేసేవారినే ఎన్నుకోవాలి. కేసులు ఉన్నవారికి ప్రశ్నించడానికి ధైర్యం ఎలా వస్తుంది.? నిస్వార్ధంగా ప్రజల కోసం నిలబడేవారికే ధైర్యం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి.. డబ్బు తీసుకుని ఓటు వేస్తే నేనేమీ చేయలేను. విభజన వేళ స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని ఒక్క ఎంపీ అడగలేదు. ప్రజల మద్దతు లేకపోతే నేనేం చేయలేను. రౌడీ ఎంపీ ఏం చేస్తారు? క్రైస్తవ సంస్థల భూమి దోచుకుంటారు? ఏ పదవి లేని నేనే ప్రధాని, హోంమంత్రి వద్దకు వెళ్తున్నా. స్వార్థం లేకుండా ఉంటే ప్రధాని ప్రధాని, హోంమంత్రి అన్నీ వింటారు అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.