Sai Dharam Tej : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో సముద్రఖని తెరకెక్కించిన చిత్రం బ్రో. జూలై 28న విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిపారు. హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగా వారసులు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ లు కూడా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు పలు అంశాల గురించి కూడా మాట్లాడాడు. అలాగే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయాన్నీ కూడా మరోసారి ప్రస్తావించి బాధపడ్డారు. పవన్ కళ్యాణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా కథకి సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ మూవీ ఓకే చేసే సమయంలోనే తనకి యాక్సిడెంట్ అయ్యింది.
త్రివిక్రమ్ ఇంట్లో ఉండగా నాకు ఫోన్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాను. చిన్న యాక్సిడెంటే, ఇంకో గంటలో బయటకి వచ్చేస్తాడు అని అనుకున్నాను. కానీ బయటకి రావడం లేదు. నాకు తెలియని ఒక నిస్సహాయత వచ్చేసింది. నాకు చాలా భయం వేసింది. తెలియని నిస్సహాయత ఒక మూలన కూర్చుని మనసులో ఏడ్చాను. వాడికి ఇంకా జీవితం ఉంది వాడిని కాపాడు అని నేను పూజించే దేవతని కోరుకున్నాను. తనని కాపాడిన డాక్టర్స్‌కి, అంతకంటే ముందు రోడ్డు మీద పడి ఉన్న తనని వెంటనే హాస్పిటల్ కి తరలించిన వ్యక్తికి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఈ సినిమా సమయంలో కూడా తేజ్ మాటలు రాక చాలా కష్టపడ్డాడు. దర్శకుడు సముద్రఖని తనని జాగ్రత్తగా చూసుకొని తనతో డైలాగ్స్ చెప్పించారు అని తెలిపారు.
ఆ తర్వాత… తేజ్ నన్ను మెడలో వేసుకునేది అడిగాడు. వాడి కోసం ప్రత్యేకంగా నీతా లుల్లాతో స్పెషల్ గా డిజైన్ చేయించి మరీ తెచ్చాను అని చెప్పి మెడలో వేసుకునే ఓ స్పెషల్ చైన్ ని స్టేజిమీదే తేజ్ కి బహూకరించాడు పవన్. అది ఇచ్చి పండగ చేస్కో అని సరదాగా అన్నారు పవన్. దీంతో అభిమానులంతా అరుపులతో తమ సంతోషాన్ని తెలియచేశారు. ఇక తేజ్ స్టేజి మీదే దాన్ని ధరించాడు. ఆ చైన్ బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ వేసుకుంటాడు. అలాంటిదే తేజ్ అడగడంతో స్పెషల్ గా డిజైన్ చేయించి తన మేనల్లుడి కోసం తెచ్చాడు పవన్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…