Chandra Babu : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటూ రాజకీయాలలో వేడిపెంచుతున్నారు. తాజాగా చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో జగన్‌తో పాటు ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందన్నారు. ఎక్స్‌పైరీ డేట్ అయ్యాక ఏ మందు వాడాలో కూడా ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
వైసీపీ నేతలకు ఒకటే చెబుతున్నా.. మీరు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.. మీరు తిడతారని నాకు తెలుసు.. మీరు ఓడిపోతారని మీకు కూడా తెలుసు. మీకు ఎక్స్ పైరీ డేటు దగ్గర పడింది. అందుకేనేమో.. ఎగిరెగిరి పడుతున్నారు. అంత ఎగిరి పడొద్దండీ.. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. మీరేం భయపడనక్కర్లా.. మీకు తగిన చోటు చూపించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది” అంటూ చంద్రబాబు ఘాటు కామెంట్స్ చేసారు. కేసులు పెడితే భయపడతారనుకుంటే, రౌడీయిజం చేస్తే భయపడతారనుకుంటే.. అది మీ వైసీపీ నేతల మూర్ఖత్వం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఓట్లను తారుమారు చేయొచ్చని అనుకుంటే అంతకంటే పొరపాటు ఇంకోటి ఉండదని చంద్రబాబు అన్నారు. దొంగ ఓట్లను చేర్చే వారికి చెబుతున్నా, ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలని, అన్నీ కంట్రోల్ చేస్తామన్నారు. తాను చెప్పే ప్రతీ మాటను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయి పంటలు మినహా మిగిలిన పంటలన్నీ సంక్షోభంలోనే ఉన్నాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయన్ని వెంటిలేటర్‌పైకి తీసుకొచ్చిందన్నారు. వనరులపై దోపిడీ.. అడిగిన ప్రతిపక్షాలపై దాడులే జగన్‌కు తెలుసునని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్లలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని నాలుగేళ్లలో రైతులకు అప్పలు తప్ప ఈ ప్రభుత్వం ఒరగబెట్టిందని శూన్యం అని అన్నారు. దోపిడీ అనేది రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో ఒక ఎకరా అమ్మితే ఆంధ్రలో 100 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చిందన్నారు. అభివృద్ధి జరిగితే, ఇరిగేషన్ పెరిగితే, ఇండస్ట్రీలు వస్తే, రోడ్డు వేస్తే ఆ భూములు విలువ పెరుగుతుందన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…