Varun Tej : బ్రో మూవీ జూలై 28న విడుదల కానున్న నేపథ్యంలో గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికొ వరుణ్ తేజ్‌తో పాటు వైష్ణవ్ తేజ్ కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు.వేదికపై మాట్లాడిన వరుణ్ తేజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ మూవీ చేస్తున్నాడు అనగానే నాకు ఈర్ష్య కలిగింది. తర్వాత ఆనందం వేసింది. కాని బాబాయ్ ని ధరమ్ తేజ్ ఒక గురువుగా చూస్తారు. ఎంతో ఆరాధిస్తారు. ఈ అవకాశం తనకే రావాలనిపించింది.
బ్రో మూవీ అందరికంటే సాయి ధరమ్ తేజ్ కి చాలా ఇంపార్టెంట్. బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాబాయ్ చిన్నప్పటి నుండి మాకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇది చేయండి అది చేయండని చెప్పలేదు. కస్టపడి మీరు ఎంచుకున్న దారుల్లో ఎదగాలని చెప్పారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. వర్షం, ఎండల్లో తిరుగుతుంటే మేము ఆయన పక్కన ఎందుకు లేము అనిపిస్తుంది. ఆయన మెగా ఫ్యామిలీని వదిలి మిమ్మల్ని కుటుంబంగా చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ బాబాయ్ చిత్ర పరిశ్రమలో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, సామాజిక సేవలో ఉన్నా… మా అందరి సపోర్ట్ ఉంటుంది. చరణ్, ధరమ్, వైష్ణవ్, నేను ఆయన వెనకుంటాము. బాబాయ్ సినిమాలు అనేకం చూసేశాము… బ్రో ఆడుతుంది. లేదంటే బ్లాక్ బస్టర్ అవుతుంది, అంటూ ముగించారు.
పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ గా బ్రో తెరకెక్కుతుండగా, ఈ సోషియో ఫాంటసీ సోషల్ డ్రామా చిత్రాన్ని జులై 28న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. బ్రో మూవీ తమిళ చిత్రం వినోదయ సితం రీమేక్ కాగా, ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని తెలుగులో కూడా తెరకెక్కించారు. త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. కథలో కూడా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఊర్వశి రాతెలా స్పెషల్ సాంగ్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…