Pawan Kalyan : నారా లోకేష్ తిట్టాడు.. గుర్తుంది.. కానీ వారితో ఎందుకు క‌లిశానంటే.. అస‌లు విష‌యం చెప్పిన ప‌వ‌న్‌..!

Pawan Kalyan : ప్రజా సమస్యలపై జనసేన పోరాటం కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం కోసం వైసీపీని నిలదీస్తా.. జనవాణిలో తమ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు సరిగ్గా రావడం లేదు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమస్యల్లో ఉన్నాయి వాటిని స‌త్వ‌ర ప‌రిష్కారం చేస్తాన‌ని ప‌వ‌న్ హామీ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. నిరసన తెలిపినా కేసులు పెడుతున్నారు. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌లకు 20వ తేదీ వరకు జీతం పడకపోవడం దారుణం.. మచిలీపట్నంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు మా దృష్టికి తెచ్చారుఅని పవన్ తెలిపారు.

అయితే నాలుగో విడ‌త వారాహి యాత్ర సాగుతుండ‌గా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెడన వారాహి విజయ యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆ నియోజకవర్గ వైసీపీ నేత, మంత్రి జోగి రమేష్ విమర్శించారు. టీడీపీతో పోత్తుపై స్పందిస్తూ.. ఏ మొహం పెట్టుకుని కలిసి పోటీ చేస్తావని ప్రశ్నించారు. 2014లో టీడీపీతో కలిసి పోటీ ఆ తర్వాత విడిపోయి బయటకు వచ్చాక చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్.. మళ్లీ ఏ మొహం పెట్టుకొని కలిశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తిట్టిన తిట్లు మర్చిపోయావా? సీఎం కావాలంటే తమ సామాజీక వర్గం బ్లడ్ అయ్యుండాలని టీడీపీ వాళ్లు తిట్టిన తిట్లు మర్చిపోయావా? పవన్ అంటూ అంటూ ధ్వజమెత్తారు.

Pawan Kalyan finally told about alliance with tdp
Pawan Kalyan

రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ బ్లడ్ ఎక్కించుకున్నావా పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో కలిశాక కాపులు పూర్తిగా జనసేనకు దూరం అయ్యారని, పవన్‌కి సిగ్గులేదు కనుకనే టీడీపీతో కలిశాడన్నారు. కాపులకు దమ్ము దైర్యం ఉంది టీడీపీ దగ్గరకి వెళ్లరు. రంగాను చంపి, ముద్రగడ ను అవమానించిన టీడీపీని కాపులు ఎప్పటికి క్షమించరంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు. అయితే వారి వ్యాఖ్య‌ల‌కి స్పందించిన ప‌వ‌న్ నేను ఎవ‌రు తిట్టిన తిట్లు మ‌ర‌చిపోలేదు. నేను ఏపీ ప్ర‌జ‌లు బాగుండాల‌నే ఉద్దేశంతోనే వారితో క‌లిసాను త‌ప్ప మ‌రో కార‌ణం లేదు. నేను ప్ర‌జ‌ల కోసం ఎన్ని తిట్లు అయిన తింటాను,
మాట‌లు ప‌డ‌తాను అంటూ ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago