Pawan Kalyan : ప్రజా సమస్యలపై జనసేన పోరాటం కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం కోసం వైసీపీని నిలదీస్తా.. జనవాణిలో తమ దృష్టికి అనేక సమస్యలు వచ్చాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు సరిగ్గా రావడం లేదు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సమస్యల్లో ఉన్నాయి వాటిని సత్వర పరిష్కారం చేస్తానని పవన్ హామీ ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. నిరసన తెలిపినా కేసులు పెడుతున్నారు. ఏపీలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌లకు 20వ తేదీ వరకు జీతం పడకపోవడం దారుణం.. మచిలీపట్నంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు మా దృష్టికి తెచ్చారుఅని పవన్ తెలిపారు.
అయితే నాలుగో విడత వారాహి యాత్ర సాగుతుండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెడన వారాహి విజయ యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆ నియోజకవర్గ వైసీపీ నేత, మంత్రి జోగి రమేష్ విమర్శించారు. టీడీపీతో పోత్తుపై స్పందిస్తూ.. ఏ మొహం పెట్టుకుని కలిసి పోటీ చేస్తావని ప్రశ్నించారు. 2014లో టీడీపీతో కలిసి పోటీ ఆ తర్వాత విడిపోయి బయటకు వచ్చాక చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్.. మళ్లీ ఏ మొహం పెట్టుకొని కలిశారని మండిపడ్డారు. టీడీపీ నేతలు తిట్టిన తిట్లు మర్చిపోయావా? సీఎం కావాలంటే తమ సామాజీక వర్గం బ్లడ్ అయ్యుండాలని టీడీపీ వాళ్లు తిట్టిన తిట్లు మర్చిపోయావా? పవన్ అంటూ అంటూ ధ్వజమెత్తారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ బ్లడ్ ఎక్కించుకున్నావా పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో కలిశాక కాపులు పూర్తిగా జనసేనకు దూరం అయ్యారని, పవన్‌కి సిగ్గులేదు కనుకనే టీడీపీతో కలిశాడన్నారు. కాపులకు దమ్ము దైర్యం ఉంది టీడీపీ దగ్గరకి వెళ్లరు. రంగాను చంపి, ముద్రగడ ను అవమానించిన టీడీపీని కాపులు ఎప్పటికి క్షమించరంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు. అయితే వారి వ్యాఖ్యలకి స్పందించిన పవన్ నేను ఎవరు తిట్టిన తిట్లు మరచిపోలేదు. నేను ఏపీ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే వారితో కలిసాను తప్ప మరో కారణం లేదు. నేను ప్రజల కోసం ఎన్ని తిట్లు అయిన తింటాను,
మాటలు పడతాను అంటూ పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.