Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తన వారాహి విజయ యాత్రలో ఆసక్తికరంగా మాట్లాడుతున్నారు. రీసెంట్‌గా తాము అధికారంలోకి వస్తే, ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తామని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. వారి మాటల్లో నిజం లేదు. సంక్షేమ పథకాలు నిలిపివేసే ఆలోచన జనసేన – తెలుగుదేశం కూటమికి లేదు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికి మరింత అదనంగా జోడించి ఇవ్వాలనే దానికి కట్టుబడి ఉన్నాం. జగన్ ప్రజలంతా కట్టిన పన్నులతో, చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు. అధికారంలో లేని సమయంలోనే ఆపదలో ఉన్న ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలబడ్డాను.
రాజకీయంలో పట్టు విడుపు ఉండదు. వైసీఆర్ కి కూడా పట్టు విడుపు ఉంది. జగన్‌కి లేదు. వైసీపీ నాయకులకి సూచన. మీ వాడికి పిచ్చ ఉంది. రోజా, విడదల రజనీ జాగ్రత్తగా ఉండండి. ఏదో రోజు నా దగ్గరకి వస్తారు. మేమే రక్షించాలి. ఆ రోజు తప్పు జరిగింది అన్న అంటే కష్టం. నేను మానవత్వంతో నేనే దగ్గరకు తీసుకోవాలి. జాగ్రత్తగా మాట్లాడండి. దళితులను చంపేసి డోర్ డెలివరీ చేసిన వారికి వైసీపీ దండలు వేస్తోంది. వారికి పార్టీ కార్యక్రమాల్లో సైతం పెద్దపీట వేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల భద్రత, అభ్యున్నతి కోసం ఉపయోగించాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ నాయకులు సొంత ప్రయోజనాలకు ఉపయోగిస్తూ సామాన్యులను ఇబ్బందిపెడుతున్నారు.

గతంలో చంద్రబాబుకు మద్దతుగా రజనీకాంత్ వ్యాఖ్యలు చేసినప్పుడు వైసీపీ నేతలు ఆయన్ను ఎలా టార్గెట్ చేశారన్నది గుర్తుచేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఎవరైనా స్పందిస్తే అలాగే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టాలీవుడ్ సహజ వైఖరిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ చాలా బలహీనమైందని పవన్ తెలిపారు. అక్కడ కూడా రాజకీయంగా ఎప్పటినుంచో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఎవరికి వారు రాజకీయంగా పలు పార్టీలకు మద్దతుగా ఉండేవారన్నారు. ఎన్టీఆర్ వంటి వారు సీఎంగా ఉండగానే ఆయనపై ఎన్నో సినిమాలు తీసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఎన్టీఆర్ వారిని టార్గెట్ చేయలేదు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పవన్ అన్నారు.