Pawan Kalyan Ennikala Ratham : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలోను తన సత్తా చాటాలని డిసైడ్ అయ్యారు. 2019 ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పంథా మార్చుకొని ముందుకు సాగుతున్నారు. ఈ సారి ఎలా అయిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కృషి చేస్తున్నారు. ఎన్నికల కోసం ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గతంలో బస్సు యాత్ర ఉంటుందని ప్రకటించినా.. ఆ తర్వాత వాయిదా పడగా, ఇప్పుడు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటనకు సిద్ధమయ్యారు. ఓ వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ వాహనానికి వారాహి అని పేరు నిర్ణయించారు.
ఈ వారాహి వాణంకు చాలా ప్రత్యేకతలు ఉండగా, ఇందులో స్పెషల్‌గా లైటింగ్.. ఆధునిక సౌండ్ సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ఈ వాహనాన్ని ప్రత్యేక భద్రత చర్యలతో పాటూ లేటెస్ట్ టెక్నాలజీతో సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటనల మయంలో గతంలో విద్యుత్ నిలిపివేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారాహి వాహనంలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఈ వాహనం నుంచి పవన్ కళ్యాణ్ ప్రసంగించే సమయంలో లైటింగ్ పరమైన ఇబ్బందులు లేకుండా వాహనం చుట్టూ లైట్లు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. జనసేనాని ప్రసంగం వేల మందికి స్పష్టంగా వినిపించే విధంగా ఆధునిక సౌండ్ సిస్టం ఏర్పాటుచేశారు.
వారాహికి నలువైపులా సీసీ కెమెరాలు అమర్చారు. 2008 నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పర్యటనల్లో ఎదురైన అంశాలని దృష్టిలో ఉంచుకొని అన్ని భద్రతా ఏర్పాట్లతో ఈ వాహనాన్ని రూపొందించారు. వాహనం లోపల పవన్ కళ్యాణ్‌తో పాటు మరో ఇద్దరు కూర్చొని చర్చించుకునే అవకాశం ఉండగా, అక్కడి నుంచి హైడ్రాలిక్ విధానంలో మెట్లు ఉంటాయి. వాటి ద్వారా వాహనం మీదకు చేరవచ్చు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఓ మిలటరీ కవాతు..పవన్ కళ్యాణ్ యుద్దానికి వెళ్తున్న ‘సినిమా’ కలరింగ్ అయితే వారాహికి సంబంధించిన వీడియోలో ఇచ్చారనే చెప్పాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…