Pawan Kalyan : ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజలకి సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు పవన్ కళ్యాణ్. 2014లో జనసేన పార్టీ స్థాపించి అప్పటి నుండి రాజకీయాలలో చురుకుగా ఉంటున్నారు. ఈ సారి ఎలాగైన గెలవాలనే కసితో ఉన్న పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పేరుతో పలు ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ఇటీవల ఏలూరు సభలో రెండో విడత వారాహి సభని ప్రారంభించి ఆ రోజు మీటింగ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్. వారాహి విజయ యాత్ర రెండో దశకు ఇంత ఘన స్వాగతం లభిస్తుందని అనుకోలేదు. మీరు చూపించే ప్రేమతో నా గుండె నిండిపోయింది. హలో ఏపీ.. బై బై వైసీపీ.. ఇదో నినాదం. దీని వెనుక ఎంతో సంఘర్షణ ఉంది. ఇది నా నుంచి వచ్చిన నినాదం కాదు.. ఏపీ ప్రజల నినాదం .
నేను సరదా కోసం రాజకీయాల్లోకి రాలేదు. పాఠశాలల్లో మహాత్ముల గురించి చెప్తారు. వచ్చే తరం కోసం నిలబడాలని.. చాలా నలిగి ఈ నిర్ణయం తీసుకున్నాను. గెలుపు ఉంటుందో లేదో తేలీదు. రాజకీయ విలువల కోసం నేను మాట్లాడుతుంటే.. వైసీపీ వాళ్లు నా తల్లి గురించి, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు. దిగజారి మాట్లాడుతున్నారు. సీఎం మంచి వాడా? కాదా? అనవసరం. ఆ స్థానానికి నేను గౌరవం ఇస్తాను అని అన్నారు పవన్.నేను అన్నింటికి తెగించే రాజకీయాలలోకి వచ్చాను. నేను 18 ఏళ్ల వయస్సులోనే చనిపోతానని అనుకున్నాను. కాని ఇన్నేళ్లు బ్రతికాను.
ప్రజా సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చాను. చస్తానని భయం లేదని పవన్ అన్నారు. అయితే ఈ పోరాటంలోతను చనిపోయిన కూడా తన ఆశయాన్ని కాపాడడానికి కొడుకు ఉన్నాడంటూ తన సన్నిహితుల దగ్గర పవన్ చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తూనే రాజకీయాలలోను యాక్టివ్‌గా ఉంటున్నారు. రీసెంట్‌గా ఢీల్లీ వెళ్లిన పవన్.. వైసీపీ వ్యతిరేఖ ఓటు చీల్చడానికి అస్సలు ఇష్టపడనని అన్నాడు. టీడీపీ, బీజేపీలతో కలిసి వైసీపీని ఓడించడమే ధ్యేయం అని పవన్ అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…