Jeevitha Rajasekhar : రాజశేఖర్, జీవితలకి వివాదాలు కొత్తేమి కాదు. పలు వివాదాలతో వారిద్దరు చాలా సార్లు హాట్ టాపిక్‌గా నిలిచారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి జీవిత-రాజశేఖర్, చిరంజీవి మధ్య గొడవలు మొదలయ్యాయి. అప్పట్లో చిరంజీవిపై వీరు చేసిన అనుచిత వ్యాఖ్యలకు అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. కారులో వెళ్తున్న ఈ దంపతులపై మెగాస్టార్ అభిమానులు దాడి చేశారు. ఆ తరువాత వీరి నడుమ మా అసోసియేషన్ లో కూడా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరి మధ్య ఎలాంటి వివాదాలు లేని సమయంలో కోర్టు సంచలన తీర్పు వెలువడటం చర్చనీయాంశంగా మారింది.
2011లో ఓ ప్రెస్ మీట్ లో జీవిత, రాజశేఖర్లు మెగాస్టార్ చిరంజీవి నిర్వహించే బ్లడ్ బ్యాంక్ ద్వారా సేకరించిన రక్తాన్ని మార్కెట్లో అమ్ముకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. నిస్వార్ధంగా చిరంజీవి సేవ చేస్తుంటే వారు అలాంటి కామెంట్స్ చేసే సరికి వారి వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణించిన సినీ నిర్మాత అల్లు అరవింద్ కోర్టును ఆశ్రయించారు. చిరంజీవి పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఎంతోమందికి సహాయం దొరుకుతుందని, అటువంటి చిరంజీవి పరువుకు భంగం కలిగేలా జీవిత రాజశేఖర్ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పేరుతో నడుస్తున్న కార్యక్రమాలపైన, చిరంజీవి ట్రస్ట్ పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జీవిత రాజశేఖర్ లపై పరువు నష్టం దావా వేశారు.
వారు చేసిన ఆరోపణలని సీడీ రూపంలో కోర్టుకి సబ్మిట్ చేశారు. అయితే ఈ కేసు పై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. జీవిత, రాజశేఖర్ ఇద్దరికీ ఏడాది జైలు శిక్షతో పాటుగా, 5000 రూపాయలు జరిమానా విధించింది. ఈ తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్న నేపథ్యంలో జరిమానా చెల్లించిన వారిద్దరు నుంచి పూచీకత్తులను సమర్పించి బెయిల్ తీసుకుని విడుదలయ్యారు. మరి వారికి జిల్లా కోర్టులో అయిన అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…