Pawan Kalyan : చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ అటు జనసేనతో ఇటు టీడీపీకి కూడా చాలా ధైర్యాన్ని అందిస్తున్నాడు. 2019 ఎన్నికలలో ఏపీలో ఎవరి దారిన వారు కావడంతో వైసీపీ భారీ మెజారిటీతో అధికారం దక్కించుకుంది. అయితే ఇప్పుడు వైసీపీ మళ్లీ ఏపీలో గెలవకూడదని టీడీపీ, జనసేన భావించడంతో రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకున్నాయి. ఏపీలో ప్రతి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు కలిసి మెలసి తిరుగుతూ జనంలోకి వెళ్లడం ఇప్పటికే మొదలైపోయింది. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా టీడీపీ, జనసేన మధ్య పొరపొచ్చాలనేవి మచ్చుకు కూడా కనిపించకపోవడంతో వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
తాజాగా పవన్ కల్యాణ్ తన యాత్ర పున:ప్రారంభించిన మచిలీపట్నం నియోజకవర్గంలో టీడీపీ కీలక నేతలంతా వెళ్లి పవన్‌ను కలిశారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ఇంఛార్జులు, సీనియర్ నాయకులు సోమవారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌ను కలిశారు. జనసేన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న తర్వాత తెలుగుదేశం నేతల బృందం పవన్‌ను కలిసింది. టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బొడే ప్రసాద్, కమ్మలి విఠల్ రావు, బూరగడ్డ వేదవ్యాస్, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజా, యార్లగడ్డ వెంకట్రావు, రావి వేంకటేశ్వర రావు.. ఒకరేమిటి మచిలీపట్నం ప్రాంత టీడీపీ పెద్ద తలకాయలన్నీ కలిసి కట్టుగా వెళ్లి పవన్‌ను కలిశాయి.
చంద్రబాబుని కలిసినట్టు టీడీపీ నేతలంతా వెళల్ఇ పవన్ ని కలవడంతో జనసేన కేడర్ సంతోషంగా ఉంది. ‘జగన్ లాంటి వ్యక్తిని ధీటుగా ఎదుర్కొవాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే కచ్చితంగా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పొత్తు ధర్మం ప్రకారం జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలి. పాత విషయాలను మనసులో పెట్టుకొని మనలో మనం గొడవలుపడితే కచ్చితంగా మళ్లి జగన్ అధికారంలోకి వస్తాడు. మన మధ్య లేనిపోని చిచ్చుపెట్టడానికి వైసీపీ సిద్ధంగా ఉంది. వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకూడదు అని పవన్ అన్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని జనసేన కార్యకర్తలు తక్కువ అంచనా వేయకండి. వారి పార్టీ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటుంది. ఈ సమయంలో మిత్రధర్మం పాటిద్దాం. జగన్‌ను ఇంటికి ఎలా పంపించాలో జనసేన నేతలకు పవన్ చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…