Ind Vs Nepal Asia Games 2023 : క్వార్టర్‌ఫైనల్స్‌లో టీమ్ ఇండియా నేరుగా చోటు సంపాదించి, నేడు నేపాల్‌తో తలపడిన విషయం తెలిసిందే. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ మంచి స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 202/4 స్కోరు చేయగా, నేపాల్ జట్టు మొత్తం ఓవర్లు ఆడి 179/9 మాత్రమే చేయగలిగింది. . భారత్ బ్యాట్స్‌మెన్స్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ వంటి బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ కావడంతో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి తొలి వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం జోడించాడు యశస్వి జైస్వాల్. 23 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, దీపేంద్ర సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..చివరలో శివమ్ దూబే 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేయగా రింకూ సింగ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.దీంతో ఇండియా రెండు వందల పరుగుల స్కోరు చేసింది.
203 పరుగుల భారీ లక్ష్యఛేదనలో నేపాల్ జట్టు, 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఆసీఫ్ షేక్ 10, కుసాల్ బుర్టెల్ 28, కుసాల్ మల్లా 29, దీపేంద్ర సింగ్ ఆరీ 32, సందీప్ జోరా 29, కరణ్ కేసీ 18 పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఆవేశ్ ఖాన్, రవి భిష్ణోయ్ మూడేసి వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్‌కి 2 వికెట్లు దక్కాయి. భారత బౌలర్స్ విషయానికి వస్తే.. రవిశ్రీనివాసన్ సాయికిషోర్‌కి ఓ వికెట్ దక్కగా వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే వికెట్లు తీయలేకపోయారు. ఆసియా క్రీడల్లో నేపాల్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సాయి కిషోర్, జాతీయ గీతాలాపాన సమయంలో ఎమోషనల్ అయ్యాడు. జనగణ మన పాడుతున్న సమయంలో సాయికిషోర్ భావోద్వేగానికి లోనై, కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకోవడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.
26 ఏళ్ల సాయికిషోర్, దేశవాళీ టోర్నీల్లో బాగా ఆడుతున్నా, ఐపీఎల్‌లోకి రావడానికి 2022 వరకూ వేచి చూడాల్సి వచ్చింది. ఆల్‌రౌండర్‌గా నిరూపించుకున్న రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, 2022 ఐపీఎల్ టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు.. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన సాయి కిషోర్, 25 పరుగులు ఇచ్చి ఓ వికెట్ పడగొట్టి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. బ్యాటింగ్ చేసే అవకాశం అతనికి రాలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…