Muralimohan : జ‌గ‌న్‌కి కూల్ వార్నింగ్ ఇచ్చిన ముర‌ళీ మోహన్.. త్వరలోనే గ్రహణం వీడుతుంది..

Muralimohan : చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత చాలా మంది ప్ర‌ముఖులు మీడియా ముందుకు వ‌చ్చి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. తాజాగా ముర‌ళీ మోహ‌న్ కూడా చంద్ర‌బాబు అరెస్ట్ చేసిన నేప‌థ్యంలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.74 సంవత్సరాలు ఉన్న ఒక మంచి ముఖ్య మంత్రిని జైల్లో పెట్టడం అన్యాయమని మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. వెంటనే ఆయన విడుదల కావాలన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేయాని ఆకాంక్ష వ్యక్తం చేశారు. అరచేయితో సూర్యుని ఆపలేము గ్రహణం విడిచిన వెంటనే వచ్చే కాంతి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసన్నారు. చంద్రబాబు కూడా గ్రహణం విడిచి అలా బయటికి వచ్చి అద్భుతంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు.

ఏపీకి పోలవరం ప్రాజెక్టు జీవనాడి కాగా, పోలవరం ప్రాజెక్టు అమరావతి నగరం ఇవన్నీ కూడా అద్భుతంగా ఆయన గ్రహణం విడిచి బయటికి వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తారని తాను నమ్ముతున్నాన‌ని ముర‌ళీ మోహ‌న్ స్ప‌ష్టం చేశారు. సైబరాబాద్ పేరుతో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ కడుతున్నాం.. మీరు రావాలి అని ఆరోజున బిల్‌ గేట్స్‌ను చంద్రబాబు అడ‌గ‌డంతో అమెరికా దాటి ఆఫీసులు పెట్టలేదు. ఇండియాలో పెట్టాల‌నుకుంటే త‌ప్ప‌కుండా హైద‌రాబాద్‌లో పెడ‌తా అని మాటిచ్చార‌ట‌. అన్న‌ట్టుగానే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పెట్టారు. మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి మిగిలినవాళ్లంతా ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. హైటెక్ సిటీ ఓపెనింగ్‌కి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్‌ను తీసుకొచ్చారు.

Muralimohan comments on cm ys jagan
Muralimohan

ఎలా మ్యానేజ్ చేశారో.. ఏం చేశారో తెలీదు కానీ.. తీసుకొచ్చారు. ఆరోజున బిల్ క్లింటన్‌కు షేక్ హ్యాండ్‌లు ఇచ్చినవారంతా నాలుగు రోజులు ఈ చేయిని కడుక్కోను అన్నంతగా అనుభూతి చెందారు. అలాంటి గొప్ప వ్యక్తిని హైటెక్ సిటీ ఓపెనింగ్‌కు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుది’ అని మురళీమోహన్ వ్యాఖ్యానించారు. ఒక మంచి ముఖ్యమంత్రిని, ఎంతో ఆదర్శంగా హైదరాబాద్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి.. అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి అనేక ప్లాన్స్ వేసిన వ్యక్తిని ఈరోజు తీసుకెళ్లి జైల్లో పెట్టారు. నీతిగా, నిజాతీయగా పనిచేసే అలాంటి వ్యక్తులను జైల్లో పెట్టడం చాలా అన్యాయం. వెంటనే ఆయన విడుదల కావాలి.. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు చేయాల‌ని అనుకుంటున్నాను అని ముర‌ళీ మోహ‌న్ స్ప‌ష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago