Pavitra Lokesh : గత కొద్ది రోజులుగా నరేష్ పవిత్రలు మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా మారుతున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని గత ఏడాది కాలంగా అనేక రకాల వార్తలు తెరమీదకు వచ్చాయి. అయితే తాము స్నేహితులం మాత్రమే అని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తూ వచ్చారు. అయితే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి వీరిద్దరిని మైసూరులో ఒకే గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత వీరు పబ్లిక్ లో కనిపించడం కాస్త తగ్గించారు. ఇటీవల కృష్ణ అంత్యక్రియల సమయంలో కూడా రమ్య రఘుపతి ఒకచోట కూర్చుని ఉండగానే నరేష్, పవిత్ర కలిసి తిరుగుతూ కనిపించడం కూడా అనేకమంది దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి.
ఇక నూతన సంవత్సరం రానున్న సందర్భంగా నరేష్ పవిత్ర లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. త్వరలో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాం అనే వీడియోని నరేష్ షేర్ చేయడంతో అందరు వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని అనుకున్నారు. కానీ ఇదంతా పబ్లిసిటీ కోసం వేసిన ఎత్తుగడ అని తేలింది.. ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం అని సమాచారం. సోషల్ మీడియాలో పలువురు ఈ విషయం డిస్కస్ చేస్తున్నారు. ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా నరేష్-పవిత్ర బయోపిక్ అని కూడా కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది.
నరేష్ పవిత్ర ఇద్దరు కలిసి జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం తాజా ఉదంతాన్ని క్యాష్ చేసుకుంటూ సాగిస్తున్న పబ్లిసిటీ గిమ్మిక్కు అని కొందరు అంటున్నారు.. ఈరోజుల్లో ఏదైనా అనవసర వివాదాన్ని కెలకడం.. వారి సినిమాకి ప్రచారం చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. నరేష్ పవిత్ర జంట కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యారు. వాళ్ళ మళ్లీ పెళ్లి సినిమాకి కావాల్సినంత ప్రమోషన్ చేసుకున్నారు.. మొత్తానికి కొత్త సంవత్సరం రాకముందే అందరిని బకరాలను చేశారు నరేష్ పవిత్ర.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ వారిపై మండిపడుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…