Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తన ప్రేమ పెళ్లిళ్లతో ఎక్కువగా వార్తలలో నిలిచింది. బిజినెస్ ఫ్యామిలీకి చెందిన కల్యాణ్ దేవ్, శ్రీజ వివాహం 2016లో జరిగింది. శ్రీజ పెళ్లిని తమ కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా జరిపించారు. శ్రీజతో వివాహం తర్వాత కల్యాణ్ దేవ్ 2018లో విజేత చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అయితే 2019 తర్వాత శ్రీజతో విభేదాల కారణంగా మెగా ఫ్యామిలికి కల్యాణ్ దేవ్ దూరం అయినట్టు సమాచారం.అంతకముందు భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, అతనికి కొన్ని రోజులకే విడాకులు ఇచ్చింది.
ప్రస్తుతం శ్రీజ తన ఇద్దరు పిల్లలతో చిరంజీవి దగ్గరే ఉంటున్నట్టు తెలుస్తుండగా, తాజాగా చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజకు ఖరీదైన ఇంటిని బహుమతిగా ఇచ్చారని సమాచారం.ఈ ఇంటి విలువ ఏకంగా 35 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. కూతురిపై ఉన్న మమకారంతో చిరంజీవి ఈ ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చినట్టు బోగట్టా.ప్రస్తుతం తను హీరోగా తెరకెక్కుతున్న సినిమాల నిర్మాతల ద్వారా వచ్చిన రెమ్యునరేషన్లతో చిరంజీవి శ్రీజకు ఈ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో చిరంజీవి విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఈ సినిమాలకి వచ్చిన రెమ్యునరేషన్‌తోనే ఇల్లు కొనుగోలు చేశాడని అంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ కూడా శ్రీజపై ఎంతో మమకారం చూపిస్తాడు. ఆ మధ్యన శ్రీజ డిప్రెషన్ లో ఉంటే రాంచరణ్ వెకేషన్ కి తీసుకువెళ్లాడు. ఇక గతంలో చెల్లెళ్లకు స్థలాలను బహుమతిగా ఇచ్చిన చిరంజీవి కూతురికి కూడా ఖరీదైన కానుక ఇవ్వగా నాన్న ఇచ్చిన బహుమతిని చూసి శ్రీజ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…