Pat Cummins : సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ప్యాట్‌ కమిన్స్‌.. ఈసారి ఐపీఎల్‌ ట్రోఫీ హైదరాబాద్‌దే..?

Pat Cummins : ప్యాట్‌ కమిన్స్‌.. ఈ పేరు చెబితే చాలు, భారతీయ క్రికెట్‌ అభిమానులకు గతేడాది ఓడిపోయిన క్రికెట్‌ వన్డే వరల్డ్‌ కప్‌ గుర్తుకు వస్తుంది. అయితే అదంతా గతం. ఇక ఇప్పుడు కమిన్స్‌ మరో అవతారంలో దర్శనమివ్వనున్నాడు. అదే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌గా. అవును, జట్టు యాజమాన్యం అతన్ని కెప్టెన్‌గా నియమించింది. దీంతో సన్‌రైజర్స్‌కు ప్యాట్‌ కమిన్స్‌ వచ్చే ఐపీఎల్‌ 2024 సీజన్‌లో నాయకత్వం వహించనున్నాడు. ప్రస్తుత సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్కరమ్‌ను తప్పించి ఆ స్థానంలో కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్‌ను జట్టు యాజమాన్యం నియమించింది.

2023 ఐపీఎల్‌ సీజన్‌ సన్‌రైజర్స్‌ కు పీడకలనే అని చెప్పవచ్చు. మొత్తం 14 గేమ్‌లలో కేవలం 4 మ్యాచ్‌లలోనే గెలిచి పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానంలో నిలిచింది. దీంతో సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఈసారి జట్టులో భారీ మార్పులే చేసింది. గతేడాది భారీ మొత్తం చెల్లించి తెచ్చుకున్న ఇంగ్లండ్‌ ప్లేయర్‌ హ్యారీ బ్రూక్‌ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో అతన్ని సన్‌రైజర్స్‌ యాజమాన్యం రిలీజ్‌ చేసింది. ఇక అతనికి బదులుగా మరికొందరు ఆటగాళ్లను ఈసారి కొనుగోలు చేసింది. వారిలో ఆస్ట్రేలియా క్రికెట్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, ఆ జట్టు బ్యాట్స్‌మన్‌ ట్రావిస్‌ హెడ్‌ ముఖ్యమైన వారు.

Pat Cummins named as sunrisers hyderabad srh captain fans want ipl 2024 trophy
Pat Cummins

డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఇతర జట్లతో పోటీ పడిన సన్‌రైజర్స్‌ ఎట్టకేలకు కమిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధర చెల్లించి మరీ కొనుగోలు చేసింది. కమిన్స్‌కు కెప్టెన్‌గా మంచి రికార్డు ఉండడమే అతనికి భారీ ధర పలకడం వెనుక ఉన్న ప్రధాన కారణమని చెప్పవచ్చు. గతేడాది ఐపీఎల్‌లో ఆడని కారణంగా కమిన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌పై దృష్టి పెట్టాడు. కప్‌ సాధించాడు. అలాగే ప్రఖ్యాత్‌ యాషెస్‌ సిరీస్‌ను రీటెయిన్‌ చేయడంతోపాటు వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌ షిప్‌లోనూ జట్టును గెలిపించాడు. దీంతో అతని ట్రాక్‌ రికార్డు కారణంగానే సన్‌రైజర్స్‌ అతన్ని కెప్టెన్‌గా నియమించిందని చెప్పవచ్చు. అసలు కమిన్స్‌ను కొన్నప్పుడే సన్‌రైజర్స్‌ అతన్ని కెప్టెన్‌గా నియమిస్తుందని భావించారు. అందరూ అనుకున్నట్లుగానే సన్‌రైజర్స్‌ కమిన్స్‌ను కెప్టెన్‌ను చేసింది. అయితే ఐసీసీ ట్రోఫీలను సాధించినట్లుగానే కమిన్స్‌ సన్‌రైజర్స్‌ కు ఐపీఎల్‌ ట్రోఫీ తెచ్చిపెడతాడని అనుకుంటున్నారు. మరి సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌ కల నిజమవుతుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.

editor

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

2 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

2 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

5 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

5 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago